ETV Bharat / state

New Year Celebrations : న్యూ ఇయర్ వేడుకలకు పోలీసు నిబంధనలు - హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలకు నిబంధనలు

New Year Restrictions in Hyderabad : నూతన సంవత్సర వేడుకలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. కొత్త ఏడాదిని స్వాగతిస్తూ ఈ ఏడాదికి ఘనంగా ముగింపు పలికేందుకు డిసెంబర్‌ 31న సంతోషంగా గడిపేందుకు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వేడుకల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు హైదరాబాద్‌ పోలీసులు పలు నిబంధనలు జారీ చేశారు.

New Year Celebrations
New Year Celebrations
author img

By

Published : Dec 19, 2022, 6:44 AM IST

New Year Celebrations Restrictions in Hyderabad : భాగ్యనగరం నూతన సంవత్సర వేడుకల కోసం వేచిచూస్తోంది. ఈసారి మరింత ఘనంగా కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే వేడుకల కోసం హోటల్లు, పబ్బులు, క్లబ్బుల నిర్వహకులు, యాజమాన్యాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు నిబంధనలు విధించారు.

New Year Celebrations in Hyderabad : న్యూ ఇయర్ వేడుకలు రాత్రి ఒంటి గంట వరకు నిర్వహించుకునేందుకు త్రీ స్టార్‌ అంతకంటే పెద్ద హోటళ్లు, పబ్బులు, క్లబ్బుల నిర్వాహకులు, యాజమాన్యాలు 10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలని తెలిపారు. వేడుకలు నిర్వహించే ప్రాంగణంలో ప్రవేశ, నిష్క్రమణ పాయింట్లు, పార్కింగ్‌ ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చాలని, ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు సెక్యురిటీ గార్డులను నియమించుకోవాలని సూచించారు. అసభ్యకర నృత్యాలు, అల్లర్లు జరగకుండా చూడాలని... వేడుకల ప్రాంగణంలో శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్‌ మించకూడదని ఆదేశించారు.

Restrictions in Hyderabad for New Year Celebrations: వేడుకల ప్రాంగణంలోకి మరణాయుధాలు అనుమతించకూడదని.. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలని సూచించారు. నిర్దిష్ఠ పరిమితికి మించి టికెట్లు, పాసులు జారీ చేస్తే చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ హెచ్చరించారు. నిర్వాహకులు ప్రత్యేక పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేయాలని, సాధారణ ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని పేర్కొన్నారు.

జంటల కోసం పబ్బులు, బార్లలో నిర్వహించే వేడుకలకు మైనర్లను అనుమతించకూడదని సీపీ ఆదేశాలు జారీ చేశఆరు. వేడుకల్లో మాదక ద్రవ్యాలు సరఫరా జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని తెలిపారు. ఎక్సైజ్‌ శాఖ అనుమతించిన సమయం దాటిన తర్వాత మద్యం సరఫరా చేయకూడదని.. వేడుకల తర్వాత మద్యం సేవించిన వారు వాహనం నడపకూడదని.. వారు ఇంటికి చేరేలా చూసే బాధ్యత యాజమాన్యలదేనని స్పష్టం చేశారు.

హోటళ్లు, పబ్బులు, క్లబ్బుల నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అలాగే మద్యం సేవించి వాహనం నడపకూడదని, మైనర్ల డ్రైవింగ్‌ నిషేధం, శబ్ద కాలుష్యం, ర్యాష్‌ డ్రైవింగ్‌పై అవగాహన కల్పించేలా తమ వేడుకల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.