Resolution on no Confidence Issues in Telangana : రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో మళ్లీ అవిశ్వాసాలు మొదలయ్యాయి. గత పది నెలలుగా స్తబ్దుగా ఉన్న అవిశ్వాసాలు ఎన్నికలు హడావుడి ముగియడంతో మళ్లీ తెలపైకి వచ్చినట్లయింది. శుక్రవారం మెదక్ జిల్లా నర్సాపూర్ పురపాలక సంఘం, మంచిర్యాల పురపాల సంఘం ఛైర్మన్లపై ఆయా మున్సిపాలిటీల కౌన్సిలర్లు అధికారులకు అవిస్వాల తీర్మానాల నోటీసులు జారీ చేశారు. వీటితో కలిపి ఇప్పటి వరకు 34 పురపాలికల్లో ఛైర్మన్లపై అవిశ్వాసాలు తెలిపైకి వచ్చినట్లు తెలుస్తోంది.
Pratidwani: మున్సిపాలిటీలు... అవిశ్వాసాల అలజడి
రాష్ట్రంలోని పురపాలక సంఘాల పాలకవర్గాలు అధికారంలోకి వచ్చి ఈ ఏడాది జనవరి 27వ తేదీతో మూడేళ్లు అయింది. ఆ మరుసటి రోజునుంచే అసమ్మతి గళాలు మొదలయ్యాయి. ఛైర్మన్లపై అవిశ్వాసాలు ప్రతిపాదిస్తూ పలు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు నోటీసులు జారీ చేశారు. అవిశ్వాస తీర్మానాలకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును గత ప్రభుత్వం అసెంబ్లీ ఆమోదించినా, గవర్నర్ ఆమోదం పొందకపోవడం వల్ల సవరణ బిల్లుకి చట్టబద్ధత రాలేదు.
No Confidence Bill With Governor in Telangana : ఈలోగా కౌన్సిలర్లు అవిశ్వాసాలు ప్రవేశ పెట్టడంతో కొందరు ఛైర్మన్లు హైకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందారు. అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి నిబంధనలు రూపొందించాలని ఇదే సమయంలో అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఇప్పట్లో అసెంబ్లీ రావడంతో అధికారులు దాన్ని పక్కన పెట్టారు.
Attack on Muncipal staff: ఆక్రమణలు తొలగిస్తుండగా మున్సిపల్ సిబ్బందిపై దాడి
పాలనవర్గం ఏర్పాటైన మూడేళ్ల తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు వీలుగా మునుపటి చట్టంలో నిబంధనలున్నాయి. ఆ నిబంధనలను నాలుగేళ్లకు సవరిస్తూ గత ప్రభుత్వం అసెంబ్లీ, శాసనమండలిలో బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత ఆమోదం పొందింది. ఆ బిల్లును ఆమోదం కోసం శాసనమండలి గవర్నర్ వద్దకు పంపింది. వివిధ కారణాలతో అది ఇప్పటికీ గవర్నర్ వద్దనే పెండింగులోనే ఉంది. అయితే చట్టసభల ఆమోదం పొందిన నాలుగేళ్ల నిబంధన గడుపు కూడా వచ్చే నెలతో పూర్తి కానుంది. వచ్చే సంవత్సరం జనవరి 27వ తేదీతో పురపాలక సంఘాల పాలకవర్గాల ఎన్నికై నాలుగేళ్లు పూర్తి అవుతుంది.
అధికారుల నిర్లక్ష్యం, నిరుపయోగంగా లక్షలు పెట్టికొన్న యంత్రాలు, పరికరాలు
ఆ తరవాత కూడా అవిశ్వాసాల వ్యవహారం తెరపైకి వచ్చే అవకాశముందన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం అసమ్మతి ఎదుర్కొంటున్న వారిలో అత్యధికులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా, గవర్నర్ తన వద్ద ఉన్న సవరణ బిల్లును ఇప్పటికైన ఆమోదిస్తారా? దీనిపై ప్రస్తుత ప్రభుత్వ విధానమేమిటనే అంశాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. వీటి ఆధారంగానే పురపాలిక ఛైర్మన్ల అవిశ్వాసాల వ్యవహారం కొలిక్కి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సర్కార్ వద్దకు 'పురపాలికల్లో అవిశ్వాసం'.. నెక్ట్స్ ఏం జరగనుందో..?