ETV Bharat / state

Cyber Crime: బాధితులకు అండగా పోలీసు, ఆర్‌బీఐ, సెబీ..! - అంబుడ్స్‌మన్‌ కార్యాలయం సమగ్ర నివేదిక

అనేక యాప్‌ల ద్వారా లేదా అనేకరకాల లింక్‌లతో సైబర్‌ నేరగాళ్లు ‘మాల్‌వేర్‌’ సెల్​ఫోన్​లోకి చొప్పించి మన సమాచారాన్ని తస్కరిస్తున్నారు. ఈ తరహా మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) అంబుడ్స్‌మన్‌ కార్యాలయం సమగ్ర నివేదికను రూపొందించింది.

Cyber Crime
సైబర్‌ నేరగాళ్లు
author img

By

Published : Oct 30, 2021, 9:58 AM IST

దుకాణానికికెళ్లి ఏదైనా కొంటే జేబులోంచి పర్సు తీసి బిల్లు చెల్లించడం పాత పద్ధతి.. ఇప్పుడు జేబులోంచి తీసేది పర్సు కాదు.. మొబైల్‌. అక్కడున్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి చటుక్కున బిల్లు చెల్లించడం మామూలైపోయింది. డిజిటల్‌ చెల్లింపులకు ఎన్నో యాప్స్‌, వాలెట్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఇలా ఇప్పుడంతా మొబైల్‌ లావాదేవీలే. ఇదే క్రమంలో రకరకాల అవసరాలపై మనం డౌన్‌లోడ్‌ చేసుకునే సాఫ్ట్‌వేర్‌లు, యాప్‌ల ద్వారా లేదా అనేకరకాల లింక్‌లతో సైబర్‌ నేరగాళ్లు ‘మాల్‌వేర్‌’ చొప్పించి మన సమాచారాన్ని తస్కరిస్తున్నారు. ఈ తరహా మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) అంబుడ్స్‌మన్‌ కార్యాలయం సమగ్ర నివేదికను రూపొందించింది.

ఎవరికి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ నివేదిక సూచించింది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే సమయంలో ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆ నివేదిక సూచించింది. కొద్దిపాటి జాగ్రత్తలతో ఆన్‌లైన్‌ మోసాల నుంచి తప్పించుకోవచ్చని వివరించింది. ఒకవేళ మోసగాళ్ల బారిన పడితే నిర్లిప్తంగా ఊరుకోకూడదని.. ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసు, ఆర్‌బీఐ, సెబీ లేదా సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేయాలని సూచించింది. స్వయంగా వెళ్లలేని పక్షంలో జరిగింది వివరిస్తూ అందుబాటులో ఉన్న ఆధారాలను జోడిస్తూ ఆన్‌లైన్లోనే ఫిర్యాదు చేస్తే వీలైనంత వరకు మోసగాళ్ల భరతం పట్టే వీలుంటుందని పేర్కొంది.

ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు

  • వెబ్‌సైట్లు చూస్తున్నపుడు అనుమానాస్పదంగా ‘పాప్‌ అప్స్‌’ కనిపిస్తే, వెంటనే అప్రమత్తం కావాలి.
  • ఆన్‌లైన్‌ చెల్లింపులు చేసేందుకు సెక్యూర్డ్‌ పేమెంట్‌ గేట్‌వే (హెచ్‌టీటీపీఎస్‌:// - యూఆర్‌ఎల్‌, ప్యాడ్‌ లాక్‌ సింబల్‌తో...)ను మాత్రమే వినియోగించాలి.
  • పిన్‌, పాస్‌వర్డ్‌, క్రెడిట్‌/ డెబిట్‌ కార్డు నంబరు, సీవీవీలను రహస్యంగా ఉంచుకోవాలి.
  • కార్డు వివరాలను వెబ్‌సైట్లు, కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌, డెస్క్‌టాప్‌ మీద భద్రపరచకూడదు.
  • టూ-ఫ్యాక్టర్‌ అథంటికేషన్‌ సదుపాయం ఉంటే, దాన్ని ఆన్‌ చేసి పెట్టుకోవాలి.
  • తెలియని సోర్స్‌ నుంచి వచ్చిన, అనుమానాస్పదమైన అటాచ్‌మెంట్స్‌/ ఫిషింగ్‌ లింక్స్‌ ఉన్న ఈమెయిళ్లను చూడవద్దు.
  • బ్యాంకు చెక్‌బుక్‌, కేవైసీ పత్రాలను తెలియని వారికి ఇవ్వరాదు.

సెల్‌/ కంప్యూటర్‌ భద్రత

  • పాస్‌వర్డ్‌లను క్రమం తప్పకుండా మార్చుకుంటూ ఉండాలి. పాస్‌వర్డ్‌లు, రహస్య సమాచారాన్ని కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లు, సెల్‌ఫోన్లలో స్టోర్‌ చేయకూడదు.
  • నమ్మకమైన యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అప్‌డేట్స్‌ను ఇన్‌స్టాల్‌ చేయాలి.
  • తెలియని యూఎస్‌బీ డ్రైవ్స్‌/ డివైజెస్‌ను వినియోగించే ముందు తప్పనిసరిగా స్కాన్‌ చేయాలి.
  • మీ సెల్‌, ల్యాప్‌ట్యాప్‌, కంప్యూటర్‌ను లాక్‌ చేయకుండా ఉంచకూడదు. కొంత సమయం తర్వాత ఆటోమాటిక్‌గా లాక్‌ అయ్యే సదుపాయాన్ని పెట్టుకోవాలి.
  • తెలియని అప్లికేషన్లు, సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేయవద్దు.

ఇ-మెయిల్‌ అకౌంట్‌/ పాస్‌వర్డ్‌ సెక్యూరిటీ

  • తెలియని అడ్రసు నుంచి వచ్చిన ఈమెయిళ్లను క్లిక్‌ చేయవద్దు. పబ్లిక్‌/ ఉచిత నెట్‌వర్క్స్‌లో ఈమెయిళ్లు వాడవద్దు. ఈమెయిళ్లలో బ్యాంకు ఖాతా నంబరు, పాస్‌వర్డ్‌.. వంటి ముఖ్యమైన సమాచారాన్ని నిల్వ చేయటం సరికాదు.
  • ఆల్ఫా న్యూమరిక్‌, స్పెషల్‌ క్యారెక్టర్‌ కాంబినేషన్‌తో పాస్‌వర్డ్‌ పెట్టుకోవాలి. పాస్‌వర్డ్‌లను తరచూ మార్చుకోవాలి.

ఆన్‌లైన్లో ఫిర్యాదు చేయవలసిన వెబ్‌సైట్లు ..

  • సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌: సైబర్‌క్రైమ్‌.జీఓవీ.ఇన్‌
  • ఆర్‌బీఐ: సీఎంస్‌.ఆర్‌బీఐ.ఓఆర్‌జీ.ఇన్‌
  • సెబీ: స్కోర్స్‌.జీఓవి.ఇన్‌
  • ఐఆర్‌డిఏఐ: ఐజీఎంఎస్‌.ఐఆర్‌డీఏ.జీఓవి.ఇన్‌
  • నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ : జీఆర్‌ఐడీఎస్‌.ఎన్‌హెచ్‌బీఆన్‌లైన్‌.ఓఆర్‌జీ.ఇన్‌

ఫైనాన్స్‌ సంస్థల్లో డిపాజిట్లు చేయవచ్చా?

అధిక వడ్డీ లభిస్తోందని ఏదైనా ఫైనాన్స్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)లో డిపాజిట్లు చేసే ముందు మదుపరులు అన్నిరకాలుగా ఆలోచించి, తగిన పరిశీలన చేసిన తర్వాతే తుది నిర్ణయానికి రావాలి. ఇందులో భాగంగా సంబంధిత ఫైనాన్స్‌ కంపెనీకి డిపాజిట్లు తీసుకునే అర్హత ఉన్నదీ లేనిదీ... ఆర్‌బీఐ వెబ్‌సైట్లో చూసి తెలుసుకోవాలి. రిజర్వు బ్యాంకు ఫైనాన్స్‌ కంపెనీలకు జారీ చేసే సర్టిఫికేట్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌ను తనిఖీ చేయాలి. ఫైనాన్స్‌ కంపెనీలు 12 నెలల కంటే తక్కువ కాలానికి లేదా 60 నెలల కంటే ఎక్కువ కాలానికి డిపాజిట్లు తీసుకోకూడదు. అంతేగాకుండా డిపాజిటర్లకు 12.5 శాతం కంటే అధిక వడ్డీరేటు ఇవ్వకూడదు. ఈ అంశాలకు భిన్నంగా ఫైనాన్స్‌ కంపెనీలు డిపాజిట్లు తీసుకుంటుంటే, వాటిని అనుమానించాల్సిందే. ఫైనాన్స్‌ కంపెనీల్లో డిపాజిట్‌ చేస్తే, దానికి సంబంధించిన డిపాజిట్‌ సర్టిఫికేట్‌/ రిసీప్ట్‌ను అడిగి తీసుకోవాలి. మధ్యవర్తులు/ ఏజెంట్ల ద్వారా డిపాజిట్‌ చేస్తుంటే, సంబంధిత వ్యక్తులు అధీకృత వ్యక్తులేనా.. అనేది నిర్ధారించుకోవాలి. ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) తీసుకునే డిపాజిట్లకు, బ్యాంకు డిపాజిట్లకు ఉన్నట్లుగా.. డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ సదుపాయం ఉండదనే విషయాన్ని గుర్తించుకోవాలి.

ఇదీ చూడండి: RBI on Cyber Crime: 'డిజిటల్‌' దొంగలొస్తున్నారు.. బీ అలర్ట్​..

తుపాకులతో బెదిరించి 8 నిమిషాల్లో రూ.1.25కోట్లు స్వాహా!

Cyber Crime in Hyderabad : రూపాయితో రీఛార్జి అన్నారు.. రూ.11 లక్షలు కొట్టేశారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.