మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గౌడలకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం దుకాణాలు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేసింది. జిల్లాల్లో జనాభా ప్రాతిపదికన లాటరీ ద్వారా దుకాణాల కేటాయింపులు చేయనున్నట్లు తెలిపింది. దరఖాస్తు రుసుము గతంలో మాదిరిగానే రూ.2 లక్షలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దుకాణాల కేటాయింపుల్లో పాత స్లాబులే కొనసాగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
నోటిఫికేషన్ జారీ
నూతన మద్యం విధానానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 2021-23 కాలానికి మద్యం దుకాణాల అనుమతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఒక వ్యక్తి ఒక దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉండేదని... కొత్త విధానంలో ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా వేసుకోవచ్చని స్పష్టం చేశారు. లైసెన్సు ఫీజు, దరఖాస్తు రుసుముల్లో మార్పులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: