ETV Bharat / state

ముందు గణతంత్రం.. తర్వాతే పెళ్లి మంత్రం..

Republic day Celebrations at Kalyana Mandapam: రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే వివాహం చేసుకునేందుకు సిద్ధంగా ఓ రెండు యువజంటలు విభిన్నంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. కల్యాణ మండపం ఆవరణలోనే.. జెండాను ఎగురవేసి.. అనంతరం వారు పెళ్లి పీటలెక్కారు. ఇదెక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Republic day Celebrations
Republic day Celebrations
author img

By

Published : Jan 27, 2023, 8:37 AM IST

Republic day Celebrations at Kalyana Mandapam: పెళ్లి మంత్రాలు ప్రారంభించడానికి అయిదు నిమిషాల ముందు ఓ రెండు యువ జంటలు జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నాయి. కల్యాణ మండపంలో పెళ్లి దుస్తుల్లోనే మువ్వన్నెల జెండాను ఎగురవేసి పెళ్లి రోజును మధుర జ్ఞాపకంగా మలుచుకున్నాయి.

ఆదిలాబాద్‌ పట్టణంలోని మహాలక్ష్మివాడకు చెందిన గండ్రత్‌ రేఖ(1వ వార్డు కౌన్సిలర్‌), కేశవ్‌ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మహేందర్‌కు భవానితో, చిన్నకుమారుడు నరేందర్‌కు సౌమ్యతో గురువారం వివాహం జరిపించడానికి నిశ్చయించారు. గణతంత్ర దినోత్సవం కావడంతో మండపం ఆవరణలోనే పతాకావిష్కరణకు ఏర్పాట్లు చేశారు. ఇద్దరు వధువులు మండపానికి రాగానే వారు జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. ఆ తర్వాతే పెళ్లి పీటలెక్కారు.

మరోవైపు 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్రంలోని అన్ని పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు.. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి: హామీల అమలే లక్ష్యం.. ఈ సారి బాహుబలి బడ్జెట్‌నే అంట.!

రాష్ట్రంలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. త్రివర్ణ శోభితమైన పార్టీ కార్యాలయాలు

రూ.20కే వైద్యం.. పేదలకు దశాబ్దాలుగా సేవ.. ఆదర్శ డాక్టరుకు పద్మశ్రీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.