Republic celebrations 2023 will be held in Raj Bhavan: గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈసారి కూడా రాజ్‌భవన్‌లోనే జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు. కొవిడ్ కారణంగా నిరుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వేడుకల నిర్వహణ విషయమై అప్పట్లో రాజ్ భవన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం జరిగింది.
గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టిన గవర్నర్.. ప్రసంగం కూడా పంపలేదని పేర్కొన్నారు. అయితే కొవిడ్ ఉద్ధృతి కారణంగా రాజ్‌భవన్‌లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తాజాగా ఈ ఏడాది కూడా రాజ్‌భవన్‌లోనే వేడుకలు జరగనున్నాయి. 26వ తేదీ ఉదయం ఏడు గంటలకు గవర్నర్ తమిళిసై జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. సాయంత్రం రాజ్‌భవన్‌లోనే ఎట్ హోమ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
గవర్నర్‌కు, కేసీఆర్‌కు మధ్య గొడవ: కేసీఆర్‌కు, గవర్నర్ తమిళిసైల మధ్య మొదట్లో విభేదాలు ఉండేవి కావు. పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ సీఎంవో పంపిన ఫైలును గవర్నర్ పక్కన పెట్టడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలకు సీఎం, మంత్రులు హాజరు కాలేదు. సమతామూర్తి విగ్రహావిష్కరణ సందర్భంగా రాష్ట్రపతిని స్వాగతించేందుకు విమానాశ్రయానికి ఇద్దరూ వచ్చినా దూరందూరంగానే ఉన్నారు.
తన ప్రసంగం లేకుండానే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగడంపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గవర్నర్ ఆహ్వానకార్డులు పంపినా వారంతా గైర్హాజరయ్యారు. యాదాద్రి ఉద్ఘాటన ఉత్సవానికీ గవర్నర్‌ను ఆహ్వానించలేదు. ఉగాది ముందస్తు వేడుకలకు సీఎం వస్తారని ఆశించినా అది జరగలేదు. దీంతో ప్రగతిభవన్, రాజ్‌భవన్‌ల మధ్య దూరం మరింత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.
రాజ్ భవన్లో గవర్నర్ జెండాను ఆవిష్కరించే సమయంలో సీఎం కేసీఆర్ ఉండాలి.. కానీ వేడుకలకు సీఎం హాజరుకాలేదు. గవర్నర్ ఒక్కరే జెండా ఆవిష్కరణ చేశారు. దీంతో బీజేపీ నేతలు, గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రగతిభవన్‌లో జెండాను ఆవిష్కరించి.. రాజ్యాంగ సంప్రదాయాలను ఆయన తుంగలో తొక్కారని.. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందని వాపోయారు. గవర్నర్ కుర్చీని కేసీఆర్ అవమానించారని.. ఇది అత్యంత హేయమైన చర్య అనీ.. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.. గవర్నర్‌ను అవమానపరిచే తీరు కనిపిస్తోందని బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు.
ఇవీ చదవండి: