హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పరిశీలించారు. డీజీపీ మహేందర్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులతో కలిసి పబ్లిక్ గార్డెన్‌ను ఆయన సందర్శించారు.
ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లను సీఎస్ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు.
ఇదీ చదవండి: యథావిధిగా శిరిడీ సాయిబాబా ఆలయ దర్శనం