ETV Bharat / state

Osmania Hospital News: ఉస్మానియాలో పరీక్షలిక చకచకా.. అత్యవసర రోగులకు ఎంతో ఉపశమనం! - Reports of tests at Osmania Hospital arrive without delay

ఉస్మానియా ఆసుపత్రి (Osmania Hospital )అత్యవసర విభాగంలో ఆటోమేటిక్‌ బయోకెమిస్ట్రీ ఎనలైజర్‌ను అందుబాటులోకి తేవడంతో రోగులకు ఎంతో మేలు చేకూరుతోంది. నిమిషాల్లో పరీక్షల నివేదికలు వస్తుండటంతో సాధ్యమైనంత త్వరగా గోల్డెన్‌ అవర్‌లో చికిత్సలు అందిస్తున్నారు.

Osmania Hospital News
Osmania Hospital News: ఉస్మానియాలో పరీక్షలిక చకచకా.. అత్యవసర రోగులకు ఎంతో ఉపశమనం!
author img

By

Published : Oct 11, 2021, 8:58 AM IST

రోగానికి చికిత్స చేయాలంటే వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎంతో కీలకం. ఆ నివేదికలు లేనిదే వైద్యులు మాత్రలివ్వరు. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెస్టుల కోసం గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. కొన్నిరకాల టెస్టులకు రోజుల తరబడి ప్రదక్షిణలు చేయాల్సిందే. ఉస్మానియా ఆసుపత్రి (Osmania Hospital )లో ఇటీవలి వరకు ఇదే పరిస్థితి. అత్యవసర చికిత్సల కోసం వచ్చేవారికి తొలుత అన్ని పరీక్షలు చేయాలి. మూత్ర పిండాల నుంచి కాలేయం వరకు వివిధ పరీక్షలో వాటి పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలి. దీంతో పరీక్షల్లో జాప్యం వల్ల రిపోర్టులు వచ్చేవరకు ప్రాథమిక చికిత్సలతో సరిపెట్టాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ ఇబ్బంది తప్పింది. తాజాగా ఉస్మానియా అత్యవసర విభాగంలో ఆటోమేటిక్‌ బయోకెమిస్ట్రీ ఎనలైజర్‌ను అందుబాటులోకి తేవడంతో రోగులకు ఎంతో మేలు చేకూరుతోంది. నిమిషాల్లో పరీక్షల నివేదికలు వస్తుండటంతో సాధ్యమైనంత త్వరగా గోల్డెన్‌ అవర్‌లో చికిత్సలు అందిస్తున్నారు.

మొత్తం బయోకెమిస్ట్రీ పరీక్షలన్నీ ఎలాంటి జాప్యం లేకుండా చేస్తున్నారు. అతి తక్కువ సిబ్బందితోనే తక్కువ వ్యవధిలోనే నాణ్యమైన నివేదికలు అందించడానికి వీలు ఏర్పడుతోంది. రీనల్‌ ప్రొఫెల్‌, లిపిడ్‌ ఫ్రొపైల్‌, టోటల్‌ ప్రొటీన్‌, అల్యూబిమిన్‌, యూరిక్‌ యాసిడ్‌, టోటల్‌ బైలురూబిన్‌, గ్లూకోజ్‌, సోడియం, పోటాషియం, ఐరన్‌ ఇతర అన్నిరకాలు పరీక్షల నివేదికలో అందించడంలో గతంతో పోల్చితే వేగం పెరిగిందని రోగులు చెబుతున్నారు.

24 గంటల్లో 400 టెస్టులు..

సాధారణ ల్యాబ్‌ల్లో రోజుకు 100 పరీక్షలు చేయడం గొప్ప విషయం. అధునాతన ఎనలైజర్‌ ద్వారా రోజుకు 400 వివిధ పరీక్షలు చేయవచ్చని వైద్యులు తెలిపారు. ఉస్మానియాలో అన్ని విభాగాలు కలిపి రోజుకు 1500 పరీక్షలు చేస్తుంటారు. ప్రస్తుతం ఒకటే బయోకెమిస్ట్రీ ఎనలైజర్‌ ఉంది. దీంతో రోగులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కొవిడ్‌ రెండోదశ తర్వాత రోగుల తాకిడి భారీగా పెరిగింది. ఉస్మానియాకు 1500-1800పైనే నిత్యం రోగులు వస్తున్నారు. గ్రేటర్‌తోపాటు రాష్ట్రంలో నలుమూలల నుంచి వస్తున్నారు. వచ్చిన ప్రతి రోగికి సాధారణ రక్త, యూరిన్‌ పరీక్షలు తప్పనిసరి. లక్షణాలనుబట్టి మరికొందరికి ఇతర పరీక్షలూ చేయాల్సిందే. ఉన్న ఒకే ల్యాబ్‌పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. శాంపిళ్లు ఇచ్చిన మరుసటి రోజుకు నివేదికలు అందుతున్నాయి. కొన్ని పరీక్షల్లో ఇంకా జాప్యం జరుగుతోంది. ఫలితంగా దూరం నుంచి వచ్చినవారు అక్కడే నిరీక్షిస్తున్నారు. ముఖ్యంగా అత్యవసర విభాగంలో టెస్టులు చేసేందుకు ప్రత్యేకంగా ఏమీ లేదు. అక్కడ శాంపిళ్లు కూడా సాధారణ ల్యాబ్‌కే పంపుతున్నారు. నివేదికలకు జాప్యం తప్పడం లేదు. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో రెండో పరికరం కోసం వైద్య ఆరోగ్యశాఖ పచ్చజెండా ఊపింది. దీంతో రూ.60 లక్షల నిధులతో టీఎస్‌ఎంఐడీసీ అధునాతన వ్యాధి నిర్ధారణ పరికరాన్ని అమర్చింది.

ఇదీ చూడండి: Weather Report Today: బంగాళాఖాతంలో అల్పపీడనం... ఇవాళ, రేపు వర్షాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.