ETV Bharat / state

వీళ్ల రాతలు వాళ్లకు చూపునిస్తున్నాయి

వారికి చూపు లేకపోయినా ఆశయాలు గొప్పవి... ఎదగాలనే పట్టుదల ఉన్నవారికి సమాజం మొత్తం సాయం చేస్తుంది అనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. కళ్లకు చూపు లేకపోయినా తమ బతుకుల్లో వెలుగులు నింపుకోడానికి చదువును ఆపోసన పట్టారు. చూపులేని ఆ అంధ విద్యార్థులకు మేమున్నామంటూ ఏటా పరీక్షల సమయంలో ఎందరో వచ్చి పరీక్షలు రాస్తూ వారి బతుకుల్లో వెలుగులు నింపుతున్నారు.

rendering helping hand to blind students
వీళ్ల రాతలు వాళ్లకు చూపునిస్తున్నాయి
author img

By

Published : Mar 10, 2020, 7:58 PM IST

వీళ్ల రాతలు వాళ్లకు చూపునిస్తున్నాయి

తోడు లేనిదే అడుగు పడదు... చుట్టూ ఏమి జరుగుతున్నా చూడలేని పరిస్థితి... చీకటి తప్ప వెలుగంటే ఎలా ఉంటుందో తెలియని జీవితం... సమాజంలో ఛీత్కారాలు... అన్నింటా అవాంతరాలు... ఇవేవీ వారి సంకల్పాన్ని నిలువరించలేక పోతున్నాయి. మొలకెత్తే లక్షణం ఉండాలే కానీ విత్తు కూడా భూమిని చీల్చుకుని రాగలదన్నంత సంకల్పంతో ఆ అంధ విద్యార్థులు తమ బతుకుల్లో వెలుగులు నింపుకోడానికి చదువుల తల్లిని నమ్ముకున్నారు. తమ సంకల్పానికి తోడుగా ఏటా పరీక్షల్లో కొంతమంది సహకారంతో పరీక్షలు రాస్తూ విజయానికి బాసటగా నిలుస్తున్నారు.

సికింద్రాబాద్ బన్సీలాల్​పేట్​లోని సాయి జూనియర్ అంధ విద్యార్థుల కళాశాల ఎందరో బతుకుల్లో వెలుగులు నింపుతుంది. ఇంటర్​ పరీక్షల్లో భాగంగా మారేడిపల్లి జూనియర్ కళాశాల కేంద్రంగా జరుగుతున్న పరీక్షల్లో అంధ విద్యార్థులు తమ సహాయకుల సాయంతో పరీక్షలు రాస్తున్నారు. బ్రెయిలీ లిపిలో నేర్చుకున్న పాఠాలను సహాయకులు సాయంతో పరీక్షలు రాస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్​ వివరించారు. తమ కళాశాల విద్యార్థులు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని జీవితాల్లో స్థిరపడడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం అంధ విద్యార్థులకు 25 మార్కులతో ఉత్తీర్ణులు అయ్యేట్లు వెసులుబాటు కల్పించింది. కేవలం విద్యార్థులకు చదువులోనే కాకుండా ఇతర సామాజిక అంశాల పట్ల క్రీడల విషయంలో కూడా అన్ని విధాలుగా తమ ప్రోత్సహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు..

తమకోసం ఇన్ని సౌకర్యాలు కల్పించి తాము జీవితాల్లో స్థిరపడేందుకు... తమ పరిస్థితిని అర్థం చేసుకుని సహకరిస్తున్న వారికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఏటా విద్యార్థుల సౌకర్యార్థం సహాయకులను ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ పనులు చేసుకుంటూ విద్యార్థులకు సాయపడడం సంతోషాన్నిస్తుందంటున్నారు.

అంధ విద్యార్థులకు సహాయం చేయండం సంతోషంగా ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ఏళ్లుగా తామంతా గ్రూపుగా వచ్చి విద్యార్థులకు తమవంతు సాయం చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: మౌంట్‌ కోసియాస్కోపై తుకారాం హోలీ సంబురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.