హైదరాబాద్ చందానగర్ సర్కిల్లోని గురుకుల ట్రస్ట్ భూముల్లో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు వెల్లడించారు.
గురుకుల ట్రస్ట్ భూముల్లో చేపట్టిన మూడు గ్రౌండ్ లెవెల్ స్ట్రక్చర్స్‌తో పాటు నిర్మాణంలో వున్న ఆరు భవనాలను నేలమట్టం చేశామని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నిర్వహించిన సర్వేలో ఇక్కడి అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారని ఆయన వివరించారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో కొత్తగా 975 కరోనా కేసులు