హైదరాబాద్ పాతబస్తీలో మొహర్రం వేడుకలలో భాగంగా మాతం ఊరేగింపును నిర్వహించారు. మాతంలో షీయా ముస్లీంలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంతాప గేయాలు అలపిస్తూ తమ శరీరాలను కత్తులు, బ్లేడులతో గాయపర్చకుంటూ రక్తం చిందించారు. డబీర్‌పురాలోని బీబీ కా అలవాను అంబారీలో ఊరేగింపుగా తీసుకువచ్చారు. అలవా ఊరేగింపు డబీర్ పురా, చార్మినార్, మీర్‌చౌక్ మీదుగా చాదర్‌ఘాట్ వరకు కొనసాగింది. ఈ ఉరేగింపులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: 'నిమజ్జనానికి వచ్చే వారు మెట్రో, ఆర్టీసీని ఆశ్రయించాలి'