ETV Bharat / state

పులిచింతల ప్రాజెక్టుకు పెరిగిన వరద.. 10 గేట్లు ఎత్తివేత - పులిచింతల జలాశయం నుంచి దిగువకు నీటి విడుదల

పులిచింతల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుత 44.43 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. నాగార్జున సాగర్ నుంచి విడుదలైన నీటితో పాటు.. పులిచింతల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షం కారణంగానూ నీరు వస్తోంది. జలాశయానికి వరద పెరుగుతుండటం వల్ల మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశముంది.

పులిచింతల ప్రాజెక్టుకు పెరిగిన వరద.. 10 గేట్లు ఎత్తివేత

author img

By

Published : Oct 13, 2020, 3:05 PM IST

నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదలతో ఆంధ్రప్రదేశ్​లోని పులిచింతల జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టుకు లక్షా 32 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. గేట్ల ద్వారా లక్షా 31 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 12వేల క్యూసెక్కులు కేటాయించారు.

ప్రస్తుతం 44.43 టీఎంసీల నిల్వ..

పులిచింతల ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుత 44.43 టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు వివరించారు. నాగార్జున సాగర్ నుంచి విడుదలైన నీటితో పాటు.. పులిచింతల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షం కారణంగానూ నీరు వస్తోంది. జలాశయానికి వరద పెరుగుతుండటం వల్ల మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశముంది. దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

ఇదీ చదవండి: నిండు కుండలా పులిచింతల ప్రాజెక్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.