ETV Bharat / state

కొత్త సిలబస్​తో ఇంటర్మీడియట్​ పుస్తకాలు విడుదల

ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరంలో సవరించిన సిలబస్​తో కూడిన కొత్త పుస్తకాలను విడుదల చేశారు. ప్రతీ ఐదేళ్లకోసారి సిలబస్ సవరిస్తుందని.. అందులో భాగంగానే సవరించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు.

Release of Intermediate books with new syllabus
కొత్త సిలబస్​తో ఉన్న ఇంటర్మీడియట్​ పుస్తకాలు విడుదల
author img

By

Published : Aug 29, 2020, 8:18 PM IST

ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరంలో హ్యుమానిటీస్ కోర్సుల సిలబస్ సవరించారు. రెండో సంవత్సరం కామర్స్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, జియోగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సవరించిన సిలబస్​తో కూడిన కొత్త పుస్తకాలను శనివారం ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, తెలుగు అకాడమీ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి విడుదల చేశారు.

ఇంటర్ బోర్డు ప్రతీ ఐదేళ్లకోసారి సిలబస్ సవరిస్తుందని.. అందులో భాగంగానే సవరించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ప్రొఫెసర్లు, డిగ్రీ, జూనియర్ కాలేజీల లెక్చరర్లతో కూడిన కమిటీ సిలబస్​ను సవరించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఫెయిలైన విద్యార్థులు పాత సిలబస్​తోనే పరీక్షలు రాసేందుకు అనుమతిస్తామని జలీల్ తెలిపారు.

ఇదీ చూడండి: జనాల మధ్యే కాదు.. ఎవరూలేని చోటా కరోనా!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.