ETV Bharat / state

రాష్ట్రంలో 61 మంది మహిళా ఖైదీల విడుదల - జాతీయ మహిళా కమిషన్

తెలంగాణలో 61 మంది మహిళా ఖైదీలు విడుదల అయ్యారు. జైళ్లలో వ్యక్తిగత దూరం పాటించే క్రమంలో విడుదలైనట్లు జాతీయ మహిళా కమిషన్​ ఓ ప్రకటనలో తెలిపింది.

release-of-61-female-prisoners-in-telangana
రాష్ట్రంలో 61 మంది మహిళా ఖైదీల విడుదల
author img

By

Published : May 12, 2020, 6:56 AM IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించడానికి, జైళ్లలో వ్యక్తిగత దూరం పాటించే క్రమంలో తెలంగాణలో 61 మంది మహిళా ఖైదీలు విడుదలైనట్లు జాతీయ మహిళా కమిషన్‌ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మహిళా ఖైదీల విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలపై 25 రాష్ట్రాల డైరెక్టర్‌ జనరళ్లు, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ప్రిజన్స్‌లతో జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ, కమిషన్‌ సభ్యులు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏప్రిల్‌ 22న తాము పంపిన సిఫార్సులపై తీసుకున్న చర్యలకు సంబంధించి ఆరా తీశారు. కరోనా కట్టడి చర్యలో భాగంగా చాలామంది మహిళా ఖైదీలు, విచారణ ఖైదీలను విడుదల చేసినట్లు వివిధ రాష్ట్రాల అధికారులు వివరించారు. తెలంగాణలోనూ 61 మంది విడుదలైనట్లు రాష్ట్ర అధికారులు తెలిపినట్లు జాతీయ మహిళా కమిషన్‌ పేర్కొంది.

ఇదీ చదవండి: రాష్ట్రంలో ఇవాళ 79 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.