సర్వర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య పరిష్కారం కావడం వల్ల రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్లు సజావుగా జరగనున్నాయి. నాలుగు రోజులుగా సర్వర్‌లో సాంకేతిక సమస్యతో రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరగక క్రయవిక్రయదారులతోపాటు అధికారులూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి ఒక డమ్మీ రిజిస్ట్రేషన్ చేసి సమస్య పరిష్కారమైనట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారుల నిర్దరించుకున్నారు.
రోజూ నాలుగైదు వేలు రిజిస్ట్రేషన్లు కావాల్సి ఉండగా సర్వర్ సక్రమంగా కనెక్ట్ కాకపోవడంతో నాలుగో వంతు కూడా జరగలేదు. ఈనెల ఒకటి నుంచి ఐదు వరకు 5వేల 11 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ అయి రూ. 103.13 కోట్ల మేర ఆదాయం వచ్చింది. సమస్య పరిష్కారంతో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొత్త రకం వ్యాధి!