ETV Bharat / state

ఓటుకు నోటు కేసులో నిందితులపై అభియోగాలు నమోదు

ఓటుకు నోటు కేసులో నిందితులపై అభియోగాల నమోదు

author img

By

Published : Feb 16, 2021, 5:04 PM IST

Updated : Feb 16, 2021, 8:26 PM IST

17:00 February 16

ఓటుకు నోటు కేసులో నిందితులపై అభియోగాలు నమోదు

    ఓటుకు నోటు కేసు విచారణ ప్రక్రియ కీలక దశకు చేరింది. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య సహా నిందితులపై అభియోగాలు నమోదు చేసింది. ఇవాళ రేవంత్ రెడ్డి, ఉదయ్​సింహా, సెబాస్టియన్​పై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12తో పాటు ఐపీసీ 120బి రెడ్ విత్ 34 ప్రకారం అభియోగాలు నమోదు చేసింది. అభియోగపత్రంలో అనిశా పేర్కొన్న అభియోగాలను రేవంత్ రెడ్డి, ఉదయ్​సింహా, సెబాస్టియన్​కు న్యాయమూర్తి చదివి వినిపించారు. అనిశా అభియోగాల్లో నిజం లేదని, విచారణ ఎదుర్కొంటామని రేవంత్ రెడ్డి, ఇతర నిందితులు పేర్కొన్నారు.  

     ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై గతంలోనే అభియోగాలు నమోదు చేసింది. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్​సింహా, సెబాస్టియన్​లపై కలిపి విచారణ చేపట్టాలని అనిశా న్యాయస్థానం నిర్ణయించింది. సాక్షుల విచారణకు ఈనెల 19న షెడ్యూలు ఖరారు చేస్తామని కోర్టు వెల్లడించింది. ఇవాళ విచారణకు రేవంత్​ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ హాజరయ్యారు.

ఇదీ చదవండి:  రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టొద్దు : ఎన్జీటీ

Last Updated : Feb 16, 2021, 8:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.