ETV Bharat / state

కరోనాతో మహిళ మృతి... అంత్యక్రియలను అడ్డుకున్న స్థానికులు - కరోనాతో మహిళ మృతి

కరోనా మహమ్మారి ప్రజలందరినీ భయపెడుతోంది. ఆఖరికి మృతి చెందినవారి అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా గ్రామస్థులు ఒప్పుకోని పరిస్థితి నెలకొంది. ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నకరికల్లు మండలం చాగల్లులో జరిగింది.

regional-obstract-corona-virus-dead-body-cremation-in-their-village-at-guntur-district
కరోనాతో మహిళ మృతి... అంత్యక్రియలను అడ్డుకున్న స్థానికులు
author img

By

Published : Apr 25, 2020, 12:19 PM IST

ఆంధ్రప్రదేశ్​ గుంటూరు జిల్లా నకరికల్లు మండలం చాగల్లుకు చెందిన ఓ మహిళ కరోనా వైరస్‌ బారిన పడి ఎన్నారై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. శుక్రవారం ఆమె మృతదేహాన్ని దహనం చేసేందుకు అంబులెన్స్‌లో గుంటూరు స్తంభాలగరువులోని శ్మశానవాటిక వద్దకు తీసుకువస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. రాళ్లు రువ్వటం వల్ల అంబులెన్స్‌ అద్దాలు ధ్వంసమయ్యాయి. దీనివల్ల అంబులెన్స్‌ వెనక్కి వెళ్లిపోయింది. తిరిగి సాయంత్రం పోలీసులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని తీసుకురాగా.. స్థానికులు మళ్లీ అడ్డుపడ్డారు. సీఐ కల్యాణరాజు నచ్చజెప్పినా అంగీకరించలేదు.

పోలీసులకు, స్థానికులకు తీవ్ర స్థాయిలో వాగ్వాదం, తోపులాట జరిగింది. అడ్డు తొలగకపోతే లాఠీఛార్జీ చేస్తామని సీఐ కల్యాణరాజు హెచ్చరించటంతో స్థానికులు వెనక్కి తగ్గారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన మృతదేహాలను ఇక్కడకు తరలిస్తుండటంతో తాము ఎక్కడ కరోనా బారిన పడతామేమోనని భయాందోళనకు గురవుతున్నామని స్థానికులు చెప్పారు. అంబులెన్స్‌ అద్దాలు ధ్వంసం చేసిన వారిపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.