ETV Bharat / state

100స్టార్టప్​లను ఎంపిక చేసి మెంటరింగ్ చేసేందుకు 'రిజిగ్.హైదరాబాద్' - Support Startups latest News

కొవిడ్ మహమ్మారి కారణంగా అవరోధాలు ఎదుర్కొంటోన్న స్టార్టప్​లకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ముందుకొచ్చింది. టీ-ఇంక్యుబేటర్స్ అండ్ ఎనేబులర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని ఓ వంద స్టార్టప్​లను ఎంపిక చేసి మానిటరింగ్ చేసేందుకు రిజిగ్. హైదరాబాద్ అనే కార్యక్రమానికి రూపకల్పన చేసింది.

100స్టార్టప్​లను ఎంపిక చేసి మెంటరింగ్ చేసేందుకు రిజిగ్.హైదరాబాద్

author img

By

Published : Aug 3, 2020, 11:52 PM IST

కొవిడ్ మహమ్మారి కారణంగా అవరోధాలు ఎదుర్కొంటోన్న స్టార్టప్​లకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ముందడుగు వేసింది. టీ-ఇంక్యుబేటర్స్ & ఎనేబులర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని ఓ 100 స్టార్టప్​లను ఎంపిక చేసి మెంటరింగ్ చేసేందుకు రిజిగ్. హైదరాబాద్ అనే కార్యక్రమానికి రూపకల్పన చేసింది. కొవిడ్ విస్తరణతో వృద్ధి, మార్కెటింగ్​లో నెమ్మదించిన స్టార్టప్​లకు దన్నుగా నిలిచేందుకు ఈ కార్యక్రమం దోహదపడనుందని ఐటీ కార్యదర్శి జయేష్​రంజన్ తెలిపారు.

ఫైనల్​గా 100 స్టార్టప్​లు

ఫలితంగా స్టార్టప్​లు వాటి కార్యచరణ, వ్యాపార నిర్వహణకు మరింత పదునుపెట్టి ఫండింగ్, కార్పొరేట్ మార్కెటింగ్ అవకాశాలకు దారులు మరింత సుగుమం కానున్నాయి. కార్యక్రమంలో భాగంగా టీఎస్ఐసీ, టీ-ఇంక్యుబేటర్స్ స్టార్టప్, ఎకోసిస్టంలోని స్టార్టప్​ల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. తయారీ, వ్యవసాయం, ఎఫ్​ఎంసీజీ, ఫిన్​టెక్, లైఫ్ సైన్సెస్, ఎమర్జింగ్ టెక్నాలజీ రంగాల నుంచి 300కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఫైనల్​గా అన్ని రంగాలు కలగలపిన 100 స్టార్టప్​ల మెంటరింగ్ ప్రోగ్రాంకు ఎంపిక చేశారు.

వారిని ఆర్థికంగా పరిపుష్టిం చేస్తాయి...

ఈ మెంటరింగ్ ప్రోగ్రాం ద్వారా స్టార్టప్​లు, కొవిడ్ అనంతర గడ్డు పరిస్థితులు, అవరోధాలను అధిగమించేలా చేయటమే కాక, వారిని ఆర్థికంగా పరిపుష్టం చేస్తాయని జయేష్ రంజన్ అన్నారు. కంపెనీల భాగస్వామ్యం, ఇంక్యుబేటర్ల సహకారం తోడై స్టార్టప్​ల వ్యాపార విధానాలకు పదును పెట్టి, పెట్టుబడులు, కార్పొరేట్ యాక్సెస్ కలగజేస్తారు. ఎదగాలనే ఆకాంక్షతో ఉవ్విళ్లూరే స్టార్టప్​లకు.. స్టార్టప్ ఎకోసిస్టంలో నిలదొక్కుకునేందుకు ఎంతగానో దోహదపడతాయని జయేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి : 'కరోనా వస్తే పెద్దోళ్లకు చేసే వైద్యమే పేదోళ్లకూ అందించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.