ETV Bharat / state

చక్రబంధంలో హైదరాబాద్‌.. రికార్డు స్థాయిలో వాహన కొనుగోళ్లు - హైదరాబాద్​ వార్తలు

హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య.. జనాభాతో పోటీపడి పెరుగుతోంది. రోజుకు వందల సంఖ్యలో కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. పెరుగుతున్న వాహన విస్ఫోటనం గ్రిడ్​లాక్​ దిశగా పరుగులు తీస్తోంది. కరోనా ప్రభావంలోనూ కొత్త వాహనాల కొనుగోళ్లు తగ్గుతాయని భావించినా... అందుకు భిన్నంగా రెండున్నర లక్షలకుపైగా కొత్త వాహనాలు రోడ్డెక్కాయి.

traffic
చక్రబంధంలో హైదరాబాద్‌.. రికార్డు స్థాయిలో వాహన కొనుగోళ్లు
author img

By

Published : Dec 3, 2020, 5:45 AM IST

Updated : Dec 3, 2020, 6:03 AM IST

చక్రబంధంలో హైదరాబాద్‌.. రికార్డు స్థాయిలో వాహన కొనుగోళ్లు

ఉరుకులు పరుగుల జీవనంలో వాహనాల పాత్ర అంతా ఇంతా కాదు. అందుకే వాటి డిమాండ్‌ రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది. రాష్ట్రంలో ఎలా ఉన్నా హైదరాబాద్‌లో మాత్రం వాహనాల పెరుగుదల జోరుగా ఉంది. ఆర్థిక స్థోమత ఎలా ఉన్నా ఇంట్లో వాహనం లేకుంటే కుటుంబ పురోగతి సైతం ముందుకెళ్లని పరిస్థితులు నెలకొన్నాయి. సంపన్నులు తిరిగే ఖరీదైన కార్లతోపాటు పేద, మధ్య తరగతి వారు తమ అవసరాలు తీర్చే ద్విచక్రవాహనాలు, సరకు రవాణా వాహనాలు సైతం అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో రోజుకు కొత్తగా 800 వరకు వాహనాలు రోడ్లపైకి వస్తున్నట్లు రవాణాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

భౌతిక దూరానికి..

ఈ ఏడాది మొదట్లో పెరుగుతున్న వాహనాల కొనుగోళ్లపై అంచనాలు వేసిన అధికారులు.. కొవిడ్‌ దృష్ట్యా వాహనాల సంఖ్య తగ్గుతుందని భావించారు. కానీ, అధికారుల అంచనాలకు భిన్నంగా నగరవాసులు రికార్డు స్థాయిలో వాహనాల కొనుగోళ్లు చేశారు. కొవిడ్ ఆంక్షలతో ప్రజారవాణా, ఇతర వాహనాలు అందుబాటులో లేకపోవటంతో ప్రజలు సొంత వాహనాల పట్ల ఆసక్తి కనబర్చారు. కరోనా దృష్ట్యా భౌతికదూరానికి అలవాటు పడిన ప్రజలు... గుంపులుగా ప్రయాణాలు చేసేందుకు జనం ఇష్టపడటంలేదు. వాహన రుణ సౌకర్యాలు ఇందుకు బాగా కలిసొస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో వాహనాల సంఖ్య రోజురోజుకూ క్రమంగా పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది జూన్‌, జులై, ఆగస్టులో హైదరాబాద్‌లో 20 వేలకు పైగా వాహనాలు కొనుగోలు చేశారు. దసరా సందర్భంగా రాయితీలు ప్రకటించడం వల్ల సెప్టెంబరులో 36 వేలు, అక్టోబరులో 25 వేల కొత్త వాహనాల కొనుగోళ్లు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అక్టోబరు నెలాఖరుకు గ్రేటర్ పరిధిలో 2లక్షల 67వేల 400 వాహనాలు కొత్తగా రిజిస్ట్రర్‌ అయ్యాయి. ఇందులో లక్షా 94వేల 311 ద్విచక్రవాహనాలే ఉన్నాయి. మొత్తం వాహనాల్లో ద్విచక్రవాహనాల వాటా 73 శాతం ఉంది. వీటితోపాటు మరో 54వేల కార్లు కొత్తగా రోడ్లపైకి వచ్చాయి.

వచ్చే ఏడాదిలో మరింత పెరిగే అవకాశం..

నగరంలో 16వేల మంది కొత్తగా కార్లు కొనుగోలు చేయగా .. మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, ఎల్బీనగర్ వంటి శివారు ప్రాంతాల్లోనే 38వేల మంది కొనుగోలు చేశారు. ద్విచక్ర వాహనాలు అనూహ్యంగా పెరుగుతుండడం సహా .. ఖరీదైన వాహనాల సంఖ్య కూడా పెరిగిపోతోందని గణాంకాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాదిలో వాహనాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

లాక్‌డౌన్‌ ఆంక్షలు పూర్తిగా సడలిస్తే..

రోజురోజుకు వస్తున్న కొత్తవాహనాలతో.. హైదరాబాద్‌ చక్రబంధంలో చిక్కుకుంటోంది. కరోనాతో పలురంగాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ.. నగర రోడ్లపై ట్రాఫిక్ ఇప్పటికే పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. లాక్‌డౌన్‌ దృష్ట్యా ఐటీతోపాటు వినోదం, ఆతిథ్య రంగాలు పూర్తిస్థాయి కార్యకలాపాలు ఇంకా మొదలుకాలేదు. ఇక లాక్‌డౌన్‌ ఆంక్షలు పూర్తిగా సడలిస్తే.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించి వాహనాలు అడుగు ముందుకు వేయలేని పరిస్థితి తలెత్తే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇవీచూడండి: ఆకతాయిల హల్​చల్​.. తల్వార్లతో రోడ్డుపై బీభత్సం

Last Updated : Dec 3, 2020, 6:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.