ETV Bharat / state

భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం.. రాష్ట్ర చరిత్రలో రెండోసారి - తెలంగాణలో నేడు విద్యుత్ వినియోగం పెరిగింది

Power Demand Increased Today in Telangana: రాష్ట్రంలో కరెంట్ వినియోగం రోజురోజుకు భారీగా పెరిగిపోతోంది. వేసవి కావడంతో.. ఉష్ణోగ్రతల తీవ్రతకు ఫ్యాన్లు, ఏసీల వాడకం పెరిగిపోయింది. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఇంతలా విద్యుత్ వినియోగం పెరగడం ఇది రెండోసారి. ఇవాళ ఉదయం 11.01 నిమిషాలకు 15, 497 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైందని అధికారులు తెలిపారు.

Power Demand Increased Today in Telangana

author img

By

Published : Mar 30, 2023, 4:16 PM IST

Power Demand Increased Today in Telangana: రాష్ట్రంలో కరెంట్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్ర చరిత్రలో మరోమారు ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగం జరిగినట్లుగా విద్యుత్ శాఖ ప్రకటించింది. ఇవాళ ఉదయం 11.01 నిమిషాలకు 15, 497 మెగావాట్ల అత్యధిక పీక్ డిమాండ్ నమోదైందని వెల్లడించారు. ఇదే రాష్ట్ర చరిత్రలో అత్యధిక వినియోగంగా విద్యుత్ శాఖ తెలిపింది.

మార్చ్ నెల ప్రారంభం నుంచే 15 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదువుతోందని వెల్లడించింది. అయితే విద్యుత్ వినియోగలో దక్షిణదిన తెలంగాణ రెండోవ స్థానంలో ఉంది. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగడం, పారిశ్రామిక అవసరాలు పెరగడం, వేసవి కాలం కావడంతో ఇళ్లల్లో కూడా కరెంట్ వినియోగం భారీగా పెరుగుతోంది. మొత్తం వినియోగంలో వ్యవసాయ రంగానికి 37 శాతం వాడుతుండగా.. మిగిలిన కరెంట్​ను పారిశ్రామిక, ఇంకా తక్కిన రంగాలకు వినియోగిస్తున్నారు.

Power consumption increased in Telangana today: మొత్తం విద్యుత్ వినియోగంలో దక్షిణ భారతదేశంలో తమిళనాడు మొదటి స్థానంలో ఉంటే.. రెండోవ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మార్చ్ 13న 14,138 మెగావాట్లు కాగా.. మార్చ్ 14వ తేదీన 15,062 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యధిక విద్యుత్ డిమాండ్ 15,497 మోగావాట్లు రికార్డ్ స్థాయిలో నమోదు కావడం ఈ నెలలో ఇది రెండోవసారి.

గత సంవత్సరం మార్చ్​ నెలలో 14,160 మెగావాట్ల అత్యధిక విద్యుత్ వినియోగాం కాగా.. ఈసారి డిసెంబర్ నెలఖారులోనే గత సంవత్సరం రికార్డ్​ను ​అధిగమించింది. ఈ నెలలోనే 15,062 మెగావాట్ల పీక్ విద్యుత్ వినియోగం దాన్ని అధిగమించి ఇవాళ 15,497 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైంది. ఈ సంవత్సంరం వేసవిలో 16 వేల మెగావాట్లు డిమాండ్ వచ్చే అవకాశం ఉన్నట్లు విద్యుత్ శాఖ అభిప్రాయ పడుతుంది.

విద్యుత్ సరఫరాకు పూర్తి ఏర్పాట్లు చేశాం: విద్యుత్ వినియోగం ఎంత డిమాండ్ వచ్చినా సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా సపఫరా చేస్తామని ట్రాన్స్ కో జెన్కో సీఎండీ ప్రభాకర్​రావు స్పష్టం చేశారు. మార్చ్ నెలలో 15 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అవుతుందని ముందే ఉహించామని వారు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యుత్ సపఫరాకు పూర్తి ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అన్నదాతలకు, అన్ని రకాల వినియోగదారులకు ఎలాంటి అంతరాయం తలేత్తకుండా నిరంతరం నాణ్యమైన కరెంట్ సపఫరా చేస్తామని సీఎండీ ప్రభాకర్​రావు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.