హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. ఇందులో భాగంగా దాదాపు రూ. 15 కోట్లతో బాలాజీ నగర్, కేపీహెచ్‌బీ డివిజన్లలో సీసీ, నూతన గ్రేవ్ యార్డ్‌లకు సంబంధించి పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు.
విమర్శలు తగదు
నిత్యం ప్రజల గురించి ఆలోచించి అడగకుండానే వారిని ఆదుకునే గొప్ప నాయకులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అని ఎమ్మెల్యే అన్నారు. వారిని విమర్శించే హక్కు ఎంపీ రేవంత్ రెడ్డికి లేదని ఎద్దేవా చేశారు. ఆపద వచ్చినప్పుడు కనబడని రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చి అధికారులను బెదిరించడమే కాకుండా నైతిక విలువలు కోల్పోయి వారిని దుర్భాషలాడటం సమంజసం కాదని మండిపడ్డారు.
వైఖరి మార్చుకోవాలి
లాక్ డౌన్ సమయంలో పేదలను కేసీఆర్ ఆర్థికంగా ఆదుకున్నారని, ఇప్పుడు వరదలు వచ్చి నీటమునిగిన ప్రాంతాల వారికి తక్షణ సాయం కింద పదివేలు అందిస్తున్నారని వెల్లడించారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 30 వేల మందికి ఆర్థిక సాయం అందించినట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తామని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ఓర్వలేక ప్రతిదీ రాజకీయం చేయాలని చూస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఆయన ఇకనైనా తన తీరు మార్చుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: అవినీతి ఆరోపణలు రుజువై కమలాపూర్ సీఐ రవిరాజాపై సస్పెన్షన్ వేటు