ETV Bharat / state

తెలంగాణలో కీలక రంగాలపై ఆర్థిక మాంద్యం ప్రభావం - recession effect on telangana

ఆర్థిక మాంద్యం రాష్ట్రంలో వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఆరేళ్లలో... సగటున నాలుగేళ్లుగా 14 శాతం జీఎస్డీపీ వృద్ధి రేటు నమోదు చేసిన తెలంగాణలో 2019-20లో 12.6 శాతానికి జీఎస్డీపీ వృద్ధిరేటు పరిమితమైంది.

recession effect on telangana state's important fields
తెలంగాణలో కీలక రంగాలపై ఆర్థిక మాంద్యం ప్రభావం
author img

By

Published : Mar 16, 2020, 8:41 AM IST

ఆర్థిక మాంద్యం రాష్ట్రంలో వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. నాలుగేళ్లుగా 14 శాతమున్న జీఎస్డీపీ వృద్ధి రేటు 2019-20లో 12.6 శాతానికి పరిమితమైంది. ప్రాథమిక రంగం.. వ్యవసాయంలో మాత్రం వృద్ధిరేటు నమోదు కాగా ద్వితీయ రంగమైన టెరీషరీలో వాటా గణనీయంగా తగ్గింది.

మాంద్యం ప్రభావం నిర్మాణం రంగంపై తీవ్రంగా పడింది. ఈ రంగంతో ముడిపడి ఉన్న వివిధ అనుబంధ పరిశ్రమలు దెబ్బతినడం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపాయి. ఫలితంగానే రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధిరేటు 12.6 శాతానికే పరిమితమైంది. నిర్మాణ రంగానికి సంబంధించి సిమెంటు, స్టీలు సహా వివిధ ఉత్పత్తులు, పరికరాలపై మాంద్యం ప్రభావం తీవ్రంగా ఉంది. తయారీరంగంలో గతేడాది కంటే దాదాపు ఏడు శాతం వృద్ధిరేటు తగ్గింది. జీఎస్డీపీలో కీలక భాగస్వామ్యం ఉండే రియల్ ఎస్టేట్, సేవల రంగం మాత్రం వాటాను పెంచుకుంది.

వ్యవసాయ రంగం వాటా పెరగడం వల్ల ఇతర రంగాల్లో తగ్గినా జీఎస్డీపీ వృద్ధి రేటు జాతీయ సగటుకంటే ఐదు శాతం ఎక్కువగా నమోదైంది. ప్రాథమిక రంగంలోని ముఖ్యమైన మైనింగ్​లో గతేడాది 23.9 శాతం వృద్ధి రేటు నమోదు కాగా ఈ ఏడాది 1.1 శాతం వృద్ధి రేటు నమోదైంది.

రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ. 1,07,907 కోట్లు పెరిగింది. జాతీయ సగటుకంటే మిన్నగా ఉన్న వివిధ రంగాలపై మాద్యం ప్రభావం పడింది. మైనింగ్, క్వారీయింగ్ సంబంధించి గతేడాది శాతమే ఈ సారీ నమోదైంది.

వృద్ధిరేటు గతం కంటే తగ్గిన కీలక రంగాలు

మైనింగ్, క్వారీయింగ్, తయారీ రంగం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవలు, నిర్మాణ రంగం, హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రేడ్, రిపేర్లు, రోడ్డు, రవాణా సేవలు, సర్వీస్ స్టోరీ ఆర్థిక సేవలు, ఇతర సేవలు

వృద్ధి రేటు పెరిగిన రంగాలు

పంటలు, పశుసంపద, అటవీ సంపద, రైల్వేలు, విమానయానం, రియల్ ఎస్టేట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.