ప్రభుత్వం ఎల్‌ఆర్ఎస్ ఛార్జీలు తగ్గించి... రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అనవసర జీవోలు తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆరోపించింది. హైదరాబాద్ అమీర్‌పేటలోని మైత్రివనం వద్ద ఉన్న హెచ్‌ఎండీఏ కార్యాలయం ముందు రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
ఎల్‌ఆర్‌ఎస్‌తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను వెంటనే చేపట్టాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరసయ్య డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్పై విడుదల చేసిన జీవోను వెనక్కి తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించిన మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్