దిశ కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై హైకోర్టులో విచారణ జరిగింది. హక్కుల సంఘాలు వేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారించింది. మృతదేహాలకు మరోసారి శవపరీక్ష నిర్వహించేలా ఆదేశాలిస్తామని న్యాయస్థానం తెలిపింది. దిల్లీ ఫోరెన్సిక్ నిపుణులతో రీపోస్టుమార్టం చేయిస్తామని స్పష్టం చేసింది. ఈప్రక్రియ పూర్తిగా రాష్ట్రేతర నిపుణులతో రీపోస్టుమార్టం అవసరం లేదని ఏజీ వాదించారు. దీనిపై ప్రభుత్వ అభిప్రాయం అడిగి తెలుసుకునేందుకు సమయం ఇవ్వాలని ఏజీ ధర్మాసనాన్ని కోరారు. రేపు ఉదయం 10.30 గం.కు అభిప్రాయం తెలపాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మృతదేహాల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని గాంధీ సూపరింటెండెంట్‌కు ఆదేశాలిచ్చింది. ఆధారాల సేకరణపై తగిన ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపధ్యంలో రాష్ట్ర న్యాయ, పోలీసు వ్యవస్థల తీరును ప్రపంచమంతా చూస్తోందని రాష్ట్ర అతున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
'దిశ' నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం..! - undefined
08:19 December 20
'దిశ' నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం..?

TAGGED:
disha