ETV Bharat / state

టీఎన్​జీవో ప్రధాన కార్యదర్శిగా రాయకంటి ప్రతాప్ ఎన్నిక - నాంపల్లి వార్తలు

ప్రస్తుతం టీఎన్​జీవో నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్న రాయకంటి ప్రతాప్... నూతన ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనను ఎన్నుకున్న వారికి కృతజ్ఞతలు తెలిపి... ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రతాప్ హామీ ఇచ్చారు.

rayakanti-pratap-taken-charge-as-a-tngo-new-general-secretary-in-nampally-tngo-bhavan
టీఎన్​జీవో ప్రధాన కార్యదర్శిగా రాయకంటి ప్రతాప్ ఎన్నిక
author img

By

Published : Sep 7, 2020, 5:29 PM IST

Updated : Sep 7, 2020, 6:34 PM IST

తెలంగాణ ఎన్​జీవో కేంద్ర సంఘం నూతన ప్రధాన కార్యదర్శిగా... ప్రస్తుతం నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్న రాయకంటి ప్రతాప్ ఎన్నికయ్యారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్​జీవో భవన్​లో జరిగిన సమావేశంలో 33 జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొని... ప్రతాప్​ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జగదీష్ ప్రధాన కార్యదర్శిగా పోటీ పడ్డారు. రాష్ట్ర కార్యవర్గంలోని అందరి అభిప్రాయాలను తీసుకొని ప్రతాప్​ను ఎన్నుకున్నట్లు సంఘం అధ్యక్షుడు రాజేందర్ తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. తనపై నమ్మకంతో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న వారికి ప్రతాప్ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ఐటీ షేర్ల దూకుడుతో స్వల్ప లాభాలు

Last Updated : Sep 7, 2020, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.