హైదరాబాద్ కేపీహెచ్బీ ఠాణా పరిధిలో అక్రమంగా లారీలో తరలిస్తున్న 240 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా లారీలో తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకే తనిఖీలు చేపట్టినట్లు కేపీహెచ్బీ సీఐ లక్ష్మీనారాయణ వెల్లడించారు. అనంతరం లారీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి : కలుషిత ఆహారం తిని బాలుడి మృతి... ఆస్పత్రిలో కుటుంబం