ETV Bharat / state

రేషన్​ బియ్యం దందా గుట్టురట్టు... ఐదుగురు అరెస్టు - latest news of rachakonda police seized ration rice

పేదలకు చెందాల్సిన రేషన్‌ బియ్యాన్ని అమ్మిసొమ్ము చేసుకుంటున్న ఐదుగురు అక్రమార్కులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 430 క్వింటాళ్ల రేషన్​ బియ్యం, ఒక లారీ, రెండు కార్లు, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

ration rice seized by rachakonda police at maheswaram in Hyderabad
రేషన్​ బియ్యం దందా గుట్టురట్టు... ఐదుగురు అరెస్టు
author img

By

Published : Jul 3, 2020, 10:56 AM IST

హైదరాబాద్​ మహేశ్వరం మండలంలోని మంకాల్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 430 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, ఒక లారీ, రెండు కార్లు, ఆటోలను సీజ్​ చేశారు.

గత కొంతకాలంగా రేషన్‌ దుకాణాల నుంచి రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసే వారి దగ్గర నుంచి తక్కువ ధరకే విక్రయించి... గోదాములో నిల్వ చేసి అధికధరలకు ఈ బియ్యాన్ని తిరిగి అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్​ అధికారులు గుర్తించారు.

దీనితో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ నేతృత్వంలో రంగంలోకి దిగిన పోలీసులు... గోదాములపై దాడులు నిర్వహించారు. కొందరు అక్కడి నుంచి పారిపోగా... ఐదుగురు నిందితులు దొరికినట్లు మహేశ్వరం పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: 'ఎస్సై నన్ను మోసం చేశాడు'... 'కాదు ఎస్సై మోసపోయాడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.