రేషన్ డీలర్ల కమిషన్ తదితర సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత అసెంబ్లీ సమావేశాల్లో చేసిన ప్రకటనలు ఆచరణలో వస్తాయని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. హైదరాబాద్ ముషీరాబాద్‌లోని కొణిజేటి శివలక్ష్మి రోశయ్య వైశ్య విశ్రాంతి భవన్లో రేషన్ డీలర్ల సంఘం క్యాలెండర్‌ని ఆయన ఆవిష్కరించారు.
డీలర్లు అందరూ ప్రభుత్వంలో భాగమే..
రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని.. త్వరలోనే సీఎం దృష్టికి సమస్యలు తీసుకెళ్తానని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున డీలర్ల సేవలను ఆయన ప్రశంసించారు. కరోనా సమయంలోనూ డీలర్లు కష్టపడి పనిచేశారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా రేషన్ డీలర్లు పనిచేస్తున్నారని... రేషన్ డీలర్లు అందరూ ప్రభుత్వంలో భాగస్వాములని ఆయన వెల్లడించారు.
అతి త్వరలో శుభవార్త..
రేషన్ డీలర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 11 కోట్ల రూపాయలు ఇవ్వడం ప్రశంసనీయమని రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షురాలు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. రేషన్ డీలర్ల సమస్యల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని, అతి త్వరలో శుభవార్త రానుందని ఆమె పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కొవిడ్ ఆస్పత్రుల ఆవరణలోని గాలిలో కరోనా వైరస్