ETV Bharat / state

సప్తవాహనాలపై శ్రీనివాసుడి అభయం - తెలంగాణ వార్తలు

సర్వాలంకరణ భూషితుడైన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు సప్త వాహనాలపై తిరుమాఢ వీధుల్లో విహరించారు. ప్రధాన వాహనాలపై ఊరేగుతూ అభయ ప్రదానం చేసిన సప్తగిరీశుని దర్శించుకొని భక్తులు పులకించిపోయారు. ఏడాది కాలం తర్వాత భక్తుల నడుమ విహరిస్తున్న శ్రీవారిని దర్శించు కొనేందుకు తరలివచ్చిన భక్తులతో తిరుగిరులు పోటెత్తాయి. పెద్దసంఖ్యలో వచ్చిన భక్తులు తిరుమలేశుని దివ్యమంగళస్వరూపాన్ని దర్శించి పునీతులయ్యారు.

rathasapthami-celebrations-in-tirumala
సప్తవాహనాలపై శ్రీనివాసుడి అభయం
author img

By

Published : Feb 20, 2021, 6:49 AM IST

మాఘ శుద్ధ సప్తమినాడు.. సూర్య జయంతిని పురస్కరించుకుని ఏపీలోని తితిదే ఆధ్వర్యంలో తిరుమలలో నిర్వహించిన రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. శుక్రవారం ఉదయం ఐదున్నర గంటలకు ప్రారంభమైన వాహన సేవలు రాత్రి తొమ్మిది గంటల వరకూ కన్నులపండువగా సాగాయి. మొదటగా స్వామివారు సూర్యప్రభవాహనంపై సూర్యనారాయణ మూర్తిగా ఊరేగుతూ వాయువ్య దిశకు చేరుకున్నారు. అక్కడ స్వామివారిపై సూర్యకిరణాలు తాకిన అనంతరం అర్చకులు.. కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించడంతో వాహన సేవలు ప్రారంభమయ్యాయి..

చిన్నశేష, గరుడ, హనుమంత వాహన సేవల్లో స్వామివారు

సూర్య ప్రభవాహన సేవ అనంతరం చిన్నశేష, గరుడ, హనుమంత వాహన సేవల్లో స్వామివారు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీవారి పుష్కరిణిలో అర్చకులు శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చరణల మద్య చక్రతాళ్వార్లకు అభిషేకాదులు, దూప దీప నైవేధ్యాలను సమర్పించి.. పుష్కరస్నానం చేయించారు. కరోనా కారణంగా చక్రస్నానంను ఏకాంతంగా నిర్వహించారు.

కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవల్లో శ్రీవారు..

ఉదయం పూట జరిగిన వాహన సేవల్లో మలయప్పస్వామివారు మాత్రమే దర్శనమివ్వగా.. మద్యాహ్నం తరువాత నిర్వహించిన కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవల్లో విశేషతిరువాభరణాలు, పరిమలభరిత పూల మాలలతో అలంకృతులైన శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీవారు తిరుమాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.

చల్లని వెన్నెల్లో అభయప్రదానం..

సాయం సంద్యవేళలో చల్లని వెన్నెల సమయంలో చంద్రప్రభను అధిరోహించిన తిరుమలేశుడు తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. వాహనసేవల్లో కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహిళల కోలాటాలు, చక్కబజనలు, వివిధ దేవతామూర్తుల వేషదారణలతో తిరుమాడవీధుల్లో ఆడిపాడారు. తితిదే ఎస్వీ బాలమందిరం విద్యార్థులు ఆలపించిన ఆదిత్యహృదయం, సూర్యాష్టకం, సంస్కృత శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కరోనా ప్రభావంతో ఆలయానికే పరిమితం..

కరోనా ప్రభావంతో ఏడాదిగా వాహన సేవలన్నీ ఆలయానికే పరిమితమయ్యాయి. వార్షిక, సాలకట్ల బ్రహ్మోత్సవాలు సైతం ఏకాంతంగా నిర్వహించడంతో సంవత్సర కాలంగా శ్రీవారి ఉత్సవాలను భక్తులు తిలకించే వీలు లేకుండా పొయింది. కరోనా తగ్గు ముఖం పట్టడం.. రథసప్తమి రోజున ఏడు ప్రధాన వాహన సేవలను దర్శించుకునే అవకాశం ఉండటం వల్ల భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రథసప్తమితో పాటు ముందు, తర్వాతి రోజుల దర్శన టికెట్లు కలిగిన భక్తులు తిరుమలకు చేరుకుని వాహన సేవల్లో పాల్గొన్నారు.

ఆర్జిత సేవల పునరుద్దరణ..

వాహనసేవలను దర్శించుకునేందుకు వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, మంచినీరు, మజ్జిగను శ్రీవారి సేవకుల ద్వారా అందిచారు. రథసప్తమి నేపథ్యంలో రద్దు చేసిన ఆర్జిత సేవలు పునరుద్దరించారు.

ఇదీ చదవండి: అంతర్వేది ఆలయ నూతన రథాన్ని ప్రారంభించిన సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.