సుందరమైన వనాలతో పాటు ఔషధ, పూల మొక్కలకు నెలవైన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలోకి ప్రజల సందర్శన శుక్రవారం ముగియనుంది. జనవరి 2 నుంచి ప్రాంగణంలోకి సందర్శకులను అధికారులు అనుమతించారు. ఏటా రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం ఇక్కడికి వస్తుంటారు. ఈసారి డిసెంబర్ 20 నుంచి 28 వరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇక్కడ బస చేశారు.
ఈసారి రెండు వారాలు..
బుధవారం వరకు మొత్తం 29వేల మందికి పైగా ఈ ప్రాంగణాన్ని సందర్శించారని అధికారులు తెలిపారు. గత ఏడాది వారం రోజుల పాటు మాత్రమే సందర్శకులను అనుమతించినప్పటికీ.. ఈ సారి రెండు వారాల పాటు అవకాశం కల్పించారు.
పెరిగిన సందర్శకుల తాకిడి..
పండగ వేళ సెలవులు ఉండటం వల్ల రాష్ట్రపతి నిలయానికి సందర్శకుల తాకిడి పెరిగింది. సంక్రాంతి పండగ వేళ కుటుంబ సభ్యులతో కలిసి ప్రాంగణంలో ఆహ్లాదంగా గడిపారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే కాకుండా రెండుసార్లు అనుమతించాలని సందర్శకులు కోరారు. ఈసారి రెండు వారాల వరకు సందర్శనకు అనుమతించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: 'హస్తానికి ఓటేస్తే.. హస్తవాసి మారుస్తాం'