ETV Bharat / state

రవీంద్రభారతిలో ముగిసిన రసరంజని నాటకోత్సవాలు - ravindra bharathi

హైదరాబాద్‌ రవీంద్రభారతిలో 26వ నాటకోత్సవాలు ఘనంగా ముగిసాయి. ప్రపంచ రంగస్థల దినోత్సవం పురస్కారించుకొని మొదలి నాగభూషణశర్మ స్మృతివేదికగా ఈ ఉత్సవాలను నిర్వహించారు.

రసరంజని నాటకోత్సవ ముగింపు వేడుకలు
author img

By

Published : Mar 28, 2019, 11:38 AM IST

రసరంజని నాటకోత్సవ ముగింపు వేడుకలు
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ప్రముఖ సాంస్కృతిక సంస్థ రసరంజని ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన నాటకోత్సవాలు ఘనంగా ముగిసాయి. ఈనెల 25 నుంచి 27వరకు మూడు రోజుల పాటు జరిగిన ప్రదర్శనలు నాటక ప్రియులను అలరించాయి.

ఆకట్టుకున్న "కలనేత"

చివరి రోజు విశ్వశాంతి కల్చరల్‌ అసోసియేషన్‌ హైదరాబాద్‌ వారిచే కలనేత నాటకం ప్రదర్శించారు. రైతులు, నేతన్నలలో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా సాగిన ఈ నాటకాన్ని ఆకెళ్ల రచించగా... బీఎం రెడ్డి దర్శకత్వం వహించారు.

ముగింపు వేడుకలకు ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, సినీ నటుడు జయప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కళాకారులను చిరు బహుమతులతో సత్కరించారు.

ఇదీ చదవండి:సీ-విజిల్ మానిటరింగ్ కేంద్రం పరిశీలన

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.