కరోనా లక్షణాలు ఉన్నవారికి, కరోనా పేషేంట్స్‌తో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నవారికి కోఠి ఇసామియా బజార్‌లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో ర్యాపిడ్ యాంటిజెన్ నిర్వహిస్తున్నారు. కరోనా కేసులు త్వరితగతిన గుర్తించేందుకు ఈ టెస్టులు నిర్వహిస్తున్నట్లు వైద్య అధికారిణి చందన తెలిపారు. శాంపిల్స్ తీసుకున్న 30 నిమిషాల్లోనే ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు.
ఈ రోజు 44 శాంపిల్స్‌ను పరీక్షించామని, అందులో 5 కేసులు పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. పాజిటివ్‌గా వచ్చి లక్షణాలు అధికంగా ఉన్నవారిని గాంధీ ఆస్పత్రికి పంపుతున్నామని... లక్షణాలు లేనివారికి ముందులు ఇచ్చి హోం ఐసోలేషన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: అజాగ్రత్త వల్లే.. ఆ కుటుంబంలో 25 మందికి కరోనా