Rape Attempt On Student In Hyderabad : మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, ఎన్ని శిక్షలు విధించినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. మగాళ్లు మృగాళ్లుగా మారుతున్నారు. కామాంధుల వికృత చేష్టలకు ఆడవాళ్లు బలైపోతున్నారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా వీటికి అడ్డుకట్ట పడటం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని కళాశాల నుంచి ఇంటికి ఒంటరిగా వెళ్తుండగా గమనించిన ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై లిఫ్ట్ ఇస్తానంటూ నమ్మించి అత్యాచారానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మహిళా మేజిస్ట్రేట్‌పై తహసీల్దార్ అత్యాచారయత్నం- బీజేపీ ఎమ్మెల్సీ ట్వీట్‌తో!
Rape Attempt : హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ విద్యార్ధినితో అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారానికి యత్నించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ద్విచక్ర వాహనంపై లిఫ్ట్ ఇస్తానంటూ నమ్మించి ఓ ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచారానికి యత్నించినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన కధనం ప్రకారం మాసబ్‌ట్యాంక్ ప్రాంతంలోని కళాశాలలో 21 సంవత్సరాల యువతి ఆర్కిటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది.
రాత్రివేళ ఆటోలో ఒంటరిగా యువతి.. ముగ్గురు యువకులు వేరే దారికి తీసుకెళ్లి..
Rape Attempt by Engineering Student In Hyderabad : ఈ నెల 10న కళాశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేస్తుండగా ప్రశాంత్ అనే యువకుడు ఆమె వద్దకు వచ్చాడు. ఆమె చదువుతున్న కళాశాలలోనే బీటెక్ చదువుతున్నట్టు పరిచయం చేసుకున్నాడు. తాను ద్విచక్ర వాహనం మీద దిగబెడతానని చెప్పి వాహనం ఎక్కించుకునే ప్రయత్నం చేయగా యువతి నిరాకరించింది. దీంతో అతను ఆమె సెల్‌ఫోన్ లాక్కొని యువతిని తన వెంట కళాశాల వద్దకు తీసుకువెళ్లాడు. అతని ద్విచక్ర వాహనం మోరాయించడంతో స్నేహితులకు ఫోన్ చేసి మరో ద్విచక్ర వాహనం తెప్పించుకుని యువతిని తన వెంట తీసుకువెళ్లాడు.
ఆమెను ఓ ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. మద్యం తెచ్చుకునేందుకు బయటకు వెళ్లిన సమయంలో యువతి బాత్‌రూం గుండా పారిపోయింది. ఈ నెల 11న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సీసీ కెమెరాలు, ఇతర ఆధారాల ద్వారా నిందితుడు ప్రశాంత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
అర్ధరాత్రి తలుపుకొట్టి అత్యాచారయత్నం.. ఆ మహిళ ఏం చేసిందో చూస్తే..!
థాయ్ విద్యార్థినిపై హెచ్‌సీయూ ప్రొఫెసర్ అత్యాచారయత్నం.. భగ్గుమన్న విద్యార్థులు