ETV Bharat / state

నవీన్ హత్య కేసు.. 3 సార్లు ప్రశ్నించినా నోరువిప్పని స్నేహితురాలు..!

Naveen Murder case Updates: హరిహరకృష్ణ కస్టడీ పిటిషన్‌పై రంగారెడ్డి జిల్లా కోర్టులో వాదనలు ముగిశాయి. నవీన్ హత్య కేసులో నిందితుడిని 8 రోజుల కస్టడీ ఇవ్వాలని పోలీసులు కోరారు. హరిహరకృష్ణ కస్టడీపై రంగారెడ్డి జిల్లా కోర్టు రేపు తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో హత్య గురించి తెలిసిన నిందితుడి స్నేహితురాలు పోలీసులకు ఏమాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది.

author img

By

Published : Mar 1, 2023, 8:39 PM IST

Updated : Mar 1, 2023, 9:15 PM IST

Etv Bharat
Etv Bharat

Naveen Murder case Updates: హైదరాబాద్ శివారు ఔటర్ రింగ్ రోడ్డు అబ్దుల్లాపూర్ మెట్ వద్ద బీటెక్ విద్యార్థి నవీన్ దారుణ హత్య సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితుడు హరిహరకృష్ణ లొంగిపోయినా.. పోలీసులు బలమైన ఆధారాల వేటలో ఉన్నారు. కేసును మ‌రింత లోతుగా విచారించేందుకు.. రంగారెడ్డి కోర్టులో క‌స్ట‌డీ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై రంగారెడ్డి జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. పోలీసులు దాఖలు చేసిన హరిహరకృష్ణ కస్టడీ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి.

Abdullapur met incident నవీన్ హత్య కేసులో పోలీసులు.. నిందితుడిని 8 రోజుల కస్టడీ ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కోర్టును కోరారు. ఈ విషయంపై విచారణ చేపట్టిన కోర్టు... హరిహరకృష్ణ కస్టడీపై రేపు తీర్పు ఇవ్వనున్న తెలిపింది. ఈ నవీన్ హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించాల్సి ఉందని పోలీసులు ధర్మాసనానికి వెల్లడించారు. నిందితుడిని నుంచి పలు వివరాలు సేకరించాల్సి ఉందని తెలిపారు. హరిహరకృష్ణ తన ఫోన్ డేటాను డిలీట్ చేశాడని కోర్టుకు పోలీసులు తెలిపారు. నవీన్ మొబైల్ ధ్వంసం చేసి చెట్ల పొదల్లో పడేశాడని వివరించారు. హత్య తర్వాత నిందితుడు ఎక్కడికి వెళ్లాడో తెలుసు కోవాలని పేర్కొన్నారు. నిందితుడు ఆధారాలు మాయం చేసి తప్పించుకోవాలని చూశాడని వాదించారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుందని కోర్టుకు తెలిపారు. ఈ వాదనలు విన్న రంగారెడ్డి జిల్లా కోర్టు.. తీర్పును రేపు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.

Naveen Murder case In Hyderabad: నవీన్ హత్యకు సంబంధించి నేరం జ‌రిగిన ప్రాంతాన్ని సీన్ రీక‌న్‌స్ట్ర‌క్ష‌న్ చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ హత్య వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. నవీన్ చరవాణిని ధ్వంసం చేసిన హరిహర.. దాన్ని ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్న పొదల్లో పడేశాడని అనుమానిస్తున్నారు.

నోరు విప్పని స్నేహితురాలు: మరోవైపు ఈ కేసులో హత్య చేసిన తరువాత నిందితుడు ఆ విషయాన్ని తన స్నేహితుడు, స్నేహితురాలు, తండ్రికి చెప్పాడు. కానీ వారి ముగ్గురిలో ఎవరూ ఈ విషయాన్ని పోలీసుకు చెప్పలేదు. ఈ విషయంపై ఉన్నతాధికారులు సీరియస్​గా ఉన్నారు. ఈ కేసులో ఈ ముగ్గురి తీరు నిందితుడికి సహకరించిన విధంగానే ఉందని భావిస్తున్నారు. విచారణకు ఈ ముగ్గురు ఏ మాత్రం సహకరించడం లేదని తేలింది.

హరిహర కృష్ణ స్నేహితురాలిని ఇప్పటికి 3 సార్లు విచారించినా ఆమె ఏ మాత్రం సహకరించడం లేదని తెలిసింది. సఖి సెంటర్​ కౌన్సిలింగ్ ఇప్పించినా ఆమె తీరులో మార్పు రాలేదు. పేద కుటుంబానికి చెందిన అమ్మాయి కుటుంబసభ్యులు పోలీసుల ముందు తీవ్రంగా రోదిస్తున్నారు. మరోవైపు నిందితుడిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించిన తరువాత పాస్ట్​ట్రాక్ కోర్టు ద్వారా విచారణ వేగవంతంగా సాగేలా చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 1, 2023, 9:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.