ETV Bharat / state

ఒకే ఒక్క పోస్టు.. ఆమెను సీఐడీ ముందుకు తీసుకెళ్లింది..! - ఫేస్​బుక్​లో రంగనాయకమ్మ పోస్ట్.. సీఐడీ నోటీసులు వార్తలు

కోట్ల రూపాయల కుంభకోణాలు.. కరుడుగట్టిన నేరాలు చేసినవారిని విచారించే విభాగం సీఐడీ. ఓ మహిళను పిలిచి విచారించింది. విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్​ ఘటనలోని అనేక అంశాలను ప్రస్తావించినందుకు.. ఆమె ఏపీ సీఐడీ ఎదుట హాజరుకావాల్సి వచ్చింది. ఇంతకీ విచారణలో ఏం జరిగింది... అసలు ఆమెపై నమోదు చేసిన కేసులేంటి?

ranganayakamma
ranganayakamma
author img

By

Published : May 21, 2020, 9:03 PM IST

ప్రశ్నించే హక్కు లేకపోతే... అది నిజమైన ప్రజాస్వామ్యం కాదు.. ఇది రాజ్యాంగ నిపుణులు చెప్పిన మాట. ఈ విషయాన్నే ఆమె ఆచరించింది. విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో 12 మంది మరణం, వందల సంఖ్యలో బాధితులు, పర్యావరణ ఇబ్బందులపై తలెత్తిన సందేహాల్ని ఫేస్​బుక్ వేదికగా ప్రశ్నించింది. ఫలితంగా ఏపీ సీఐడీ విచారణ ఎదుర్కొవాల్సి వచ్చింది. అంతేనా అంటే ఈ కేసు ఇక్కడితో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే.. మీరు చేసిన పోస్టింగ్​ల సంగతేంటని కూడా సీఐడీ ఆమెను ప్రశ్నించింది. ఆమె పాత పోస్ట్​లను కూడా తిరగదొడుతున్నట్లు కనిపిస్తోంది. ఇంతకీ విచారణలో ఆమెను ఏం అడిగారు? రంగనాయకమ్మ ఏం చెప్పారు?

విశాఖ ఎల్జీ పాలిమర్స్​లో గ్యాస్ లీకేజ్​ ఘటన ​రాష్ట్రంలో మునుపెన్నడు లేనంత తీవ్రస్థాయి దుర్ఘటన. దేశాన్నంతా ఒక్కసారి ఉలికిపాటుకు గురిచేసింది. మరో భోపాల్​ గ్యాస్ ప్రమాదాన్ని గుర్తు చేసింది. కళ్లముందే.. పిల్లలూ.. పెద్దలు ఒరిగిపోయిన దృశ్యాలు చూసి నిర్ఘాంతపోయాం.. అసలు ఎందుకిలా జరిగింది? ప్రమాదానికి కారణాలేంటి? కంపెనీ యాజమాన్యం ఎక్కడ తప్పు చేసింది? ప్రభుత్వం, పోలీసులు ఎలా వ్యవహరించారు? ఇవన్నీ కూడా అందరిలో నెలకొన్న సందేహాలు.

ఆ సందేహాలనే ఫేస్​బుక్ వేదికగా రఘునాథ్ అనే వ్యక్తి లేవనెత్తారు. గుంటూరుకు చెందిన 65 ఏళ్ల రంగనాయకమ్మ... ఆ పోస్టుని చూసి తన ఫేస్​బుక్​ వాల్​పై షేర్ చేశారు. అలా ఆ పోస్టు చాలామందికే చేరింది. ఈ విషయం ఆ రాష్ట్ర సీఐడీ దృష్టికి వెళ్లింది. ఆమెకు నోటీసులు అందజేసింది. తమ ఎదుట హాజరుకావాలని చెప్పింది. ఆమె చేసిందల్లా... కేవలం ప్రశ్నించడమే..

గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి ఆమె విచారణ కోసం వెళ్లింది. మహిళను విచారించటం కోసం మహిళా కానిస్టేబుల్ ఉండాలనే నిబంధన మేరకు కాసేపు బయటే ఉండమని చెప్పారు. లేడీ కానిస్టేబుల్ వచ్చిన తర్వాత విచారణ కోసం పిలిచారు. ముందుగా సీఐ దిలీప్ ఆమెను విచారించారు. దాదాపు రెండు గంటల తర్వాత సీఐడీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ వచ్చారు. మెుత్తం మూడు గంటల పాటు ఆమెను విచారణ జరిగింది.

రంగనాయకమ్మపై నమోదు చేసిన కేసులు:

సీఆర్​పీసీ-41ఏ కింద ఆమెకు అరెస్టు నోటీసులిచ్చారు. సీఆర్​.నెంబర్ 24/2020 యూ/ఎస్​ 505(2), 153(ఏ), 188, 120-బీ ఆర్​/డబ్ల్యూ 34 ఐపీసీ, సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్​-2008 కేసు నమోదు చేశారు.

సీఐడి అధికారుల ప్రశ్నలు

ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు పోస్టు పెట్టారు? తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారు. మీ ఉద్దేశం ఏమిటి? రఘునాథ్ అనే వ్యక్తి షేర్ ఆప్షన్ లేకుండా తన ఫేస్ బుక్​లో పోస్టు పెట్టారు. కానీ మీరు దాన్ని కాపీ చేసి మరీ మీ ఫేస్ బుక్ పేజీలో పెట్టాల్సిన అవసరం ఏంటి? మీరు గతంలో పెట్టిన పోస్టుల సంగతేంటి?

గతంలో నా ఫేస్‌బుక్‌ పోస్టులపై కూడా అడిగారు. అన్నింటిని ప్రజల కోసమే నా అభిప్రాయంగా చెప్పా. పత్రికలు, టీవీల్లో దృశ్యాలు చూసి స్పందించాను. సీఐడీ అధికారులు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు.

-రంగనాయకమ్మ

ఒకే ఒక్క పోస్టు.. ఆమెను సీఐడీ ముందుకు తీసుకెళ్లింది..!

ఈ వ్యవహారంలో మొదటగా ఫేస్​బుక్​లో పోస్టు పెట్టిన రఘునాథ్​కు కూడా సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 25న రఘునాథ్​ విచారణకు రానున్నారు. అతని వాదన విన్న తర్వాత మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని రంగనాయకమ్మకు సీఐడీ తెలిపింది.

  • సీఐడీ ప్రకటన

ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పి 50 శాతం జీతాలు తగ్గించారని రంగనాయకమ్మ పోస్ట్​ పెట్టినట్లు సీఐడీ ప్రకటించింది. ఎల్‌జీ పాలిమర్స్ ప్రమాదం గురించే కాకుండా చాలా పోస్టులు పెట్టారని తెలిపింది. ప్రభుత్వ పథకాలను విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారని సీఐడీ పేర్కొంది. ఇవాళ్టి విచారణలో రంగనాయకమ్మ సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌గా చెప్పారని వెల్లడించింది.

రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛ పరిధిలోనే రంగనాయకమ్మ వ్యవహరించారు. ఆమె లేవనెత్తిన ప్రశ్నలు సీఐడీ అధికారులు పెట్టిన సీఆర్పీసీ సెక్షన్ 41ఏ పరిధిలో లేవు. ప్రజాస్వామ్య హక్కులకు ప్రభుత్వం, పోలీసులు విఘాతం కల్గించటం సరికాదు. సీఐడీ పోలీసులు కోర్టులో దోషులుగా నిలబడాల్సి వస్తుంది.

- హరిబాబు, న్యాయవాది

  • 65 ఏళ్ల వయసులో ఈ నోటీసులేంటి?

తనకున్న సందేహాలను అడిగినందుకు ఓ మహిళకు నోటీసులివ్వడమేంటని.. ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తెదేపా, భాజపా, సీపీఐ పార్టీలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. తమకూ అలాంటి సందేహాలే ఉన్నాయని.. అదే పోస్ట్ షేర్ చేస్తామని.. తమకూ నోటీసులివ్వాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాయి.

గతంలో ముంబైలో బాల్ ఠాక్రే మరణించిన సమయంలో హర్తాళ్ జరిగితే దానిపై పోస్టులు పెట్టిన వారిపైనా కేసులు పెట్టారు. అప్పుడు సుప్రీంకోర్టు కొట్టేసింది. భావప్రకటనా స్వేచ్ఛ అని స్పష్టంగా చెప్పింది. ముఖ్యమంత్రి జగన్ వైఖరి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్... భారత్​ పరిధిలో ఉందా? లేదా? అనే అనుమానం వస్తోంది. అక్కడి తీర్పు ఇక్కడా వర్తిస్తుంది కదా. ఆమె లేవెనత్తిన సందేహాలే నాకూ ఉన్నాయి. నేను కూడా ఆ పోస్టు షేర్ చేస్తున్నా... చేతనైతే మమ్మల్ని అరెస్టు చేయండి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా?

- రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ఇదీ చదవండి: మరోసారి విచారణకు రావాలన్నారు: రంగనాయకమ్మ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.