హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయంలో రంగం కార్యక్రమం ఘనంగా జరిగింది. అమ్మవారి భక్తురాలు అనురాధ భవిష్యవాణి వినిపించారు. ఆలయం వద్ద పచ్చికుండపై నిలబడి అమ్మవారిని ఆవహింపజేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సలహాదారులు మహేష్ గౌడ్, మానిక్ ప్రభుగౌడలు అడిగిన ప్రశ్నలకు అమ్మవారు సమాధానాలు చెప్పారు.
ఆలయ విస్తరణ చేయండి
తనకు స్థలం సరిపోవడం లేదని... ఆలయ విస్తరణ పనులు చేయాలని అమ్మవారు భవిష్యవాణిలో చెప్పారు. ప్రతి ఏటా చెబుతున్నా... పనులు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి ఆలయ విస్తరణ పనులకు తనను దర్శించి తిలకం ధరించి వెళ్లాలని సూచించారు. ఆలయం ముందు ధ్వజ స్తంభం ఏర్పాటు చేయాలని అన్నారు. ఐదు వారాలు సాక పెట్టి నైవేద్య బోనం సమర్పించాలని అన్నారు. వర్షాలు బాగా పడతాయని అమ్మవారు భవిష్యవాణిలో చెప్పారు.
ఇదీ చూడండి : పులిబిడ్డకు బారసాల.. హిమాదాస్గా నామకరణం!