ETV Bharat / state

అట్లూరి రామ్మోహన్‌రావు కన్నుమూత - ఏఐజీ ఆస్పత్రిలో రామ్మోహన్‌రావు కన్నుమూత

md
md
author img

By

Published : Oct 22, 2022, 2:48 PM IST

Updated : Oct 22, 2022, 7:58 PM IST

14:43 October 22

అట్లూరి రామ్మోహన్‌రావు కన్నుమూత

అట్లూరి రామ్మోహన్‌రావు కన్నుమూత

Atluri Rammohan Rao passed away: రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీగా పనిచేసిన అట్లూరి రామ్మోహన్‌రావు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట 49 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. రేపు ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 1936లో కృష్ణాజిల్లా పెదపారుపూడిలో జన్మించిన రామ్మోహన్‌రావు ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. జిల్లా పరిషత్‌ పాఠశాలలో సైన్స్‌ టీచర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 1974లో ఈనాడులో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.

1978లో ఈనాడు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1982లో ఈనాడు ఎండీగా పదోన్నతి పొంది... 1995 వరకు కొనసాగారు. 1992 నుంచి ఫిల్మ్‌సిటీ నిర్మాణ వ్యవహారాల్లోనూ పాలు పంచుకున్నారు. 1995లో ఫిల్మ్‌సిటీ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. రామోజీ, ఈనాడు గ్రూపు సంస్థల్లో సుదీర్ఘకాలం పనిచేసిన రామ్మోహనరావు... రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు... సహాధ్యాయి, బాల్య స్నేహితుడు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 22, 2022, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.