కరోనా మహమ్మారిని త్వరగా పారదోలేందుకు ప్రభుత్వ నియమ నిబంధనలతో పాటు స్వీయ నియంత్రణ పాటిస్తూ... ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని ప్రభత్వ సలహాదారుడు కేవీ రమణాచారి కోరారు. హరేకృష్ణ మూమెంట్, అక్షయ పాత్ర ఫౌండేషన్ సౌజన్యంతో... హైదరాబాద్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ సమావేశ మందిరంలో 100 మంది బ్రాహ్మణులకు... క్రీడా ప్రాధికారక సంస్థ ఛైర్మెన్ వెంకటేశ్వర రెడ్డి , గచ్చిబౌలి కార్పొరేటర్ సాయి బాబాతో కలిసి రమణాచారి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
తులసి రసం తాగి జీవితం గడిపే చాలా మంది బ్రాహ్మణులను తాను చూశానని ... అటువంటి పేద బ్రాహ్మణులకు దాతలు ఇచ్చే ఈ సరుకులు కొంత మేర ఉపశమనం ఇస్తాయన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో ఉన్నవారు... లేని వారికి సహాయం చేసేందుకు ముందుకు రావాలని రమణాచారి కోరారు.
ఇదీ చదవండి: గాలి ద్వారా కరోనా.. అడ్డుకోవడం ఎలా?