పర్యావరణానికి మేలు చేసే హరితహారం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారం స్ఫూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఓ మహోన్నత ఘట్టమని వ్యాఖ్యానించారు. ఈ ఛాలెంజ్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
మణికొండలోని తన నివాసంలో గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా రామజోగయ్య మొక్కలు నాటారు. ఈ సంద్భంగా సినీ కవి చంద్రబోస్, సంగీత దర్శకులు థమన్, సినీ హీరో రాజ్ తరుణ్‌కు గ్రీన్ ఛాలెంజ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధి, హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ నిర్వాహకులు సుబ్బరాజు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆఫీస్‌కి కరోనా వచ్చింది.. నేను ఇంటికొచ్చేస్తున్నా!