తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారం లో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ఎంపీ సంతోశ్ కుమార్ చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఖైదీలతో కలిసి మొక్కలు నాటారు. ఖైదీలతో వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఖైదీలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి తప్పకుండా సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రాంమ్మోహన్, జైళ్లశాఖ డీజీ రాజీవ్ త్రివేది, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.