ETV Bharat / state

రాజ్యసభకు తెరాస అభ్యర్థులు ఏకగ్రీవం!.. ఆ ఇద్దరి నామినేషన్లు తిరస్కరణ - ఏకగ్రీవం కానున్న రాజ్యసభ

Rajyasabha Elections: రాష్ట్రంలో రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. రెండు స్థానాలకు ఇద్దరు అభ్యర్థులు మాత్రమే బరిలో మిగిలారు. ఇవాళ నామినేషన్లను పరిశీలించిన ఎన్నికల అధికారులు.. మరో ఇద్దరి నామినేషన్లను తిరస్కరించారు.

Rajyasabha Elections:
ఏకగ్రీవం కానున్న రాజ్యసభ ఎన్నికలు
author img

By

Published : Jun 1, 2022, 7:19 PM IST

Rajyasabha Elections: రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. ఇవాళ వాటిని పరిశీలించిన అధికారులు ఇద్దరు మాత్రమే బరిలో ఉన్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల ఇన్ ఛార్జ్ ప్రధానాధికారి జ్యోతిబుద్ధ ప్రకాశ్ సమక్షంలో రిటర్నింగ్ అధికారి నామినేషన్లను పరిశీలించారు. శ్రమజీవి పార్టీ అభ్యర్థులు భోజరాజ్ కోయల్కర్, జాజుల భాస్కర్ నామినేషన్లను తిరస్కరించారు. వారిని ప్రతిపాదించిన వారు లేకపోవడంతో తిరస్కరణకు గురయ్యాయని వెల్లడించారు.

తెరాస అభ్యర్థులు దామోదర్ రావు, పార్థసారధిరెడ్డి నామినేషన్లు ధ్రువీకరించిన అధికారులు.. వారిద్దరు మాత్రమే బరిలో ఉన్నట్లు ప్రకటించారు. దీంతో రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్ల ఉపసంహరణకు మూడో తేదీ వరకు గడువున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఇద్దరు సభ్యులు రాజ్యసభకు ఎన్నికైనట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు.

ఇవీ చదవండి: Viral Video: "కష్టాలు ఊరికే రావు.." పెళ్లి చేసుకుని ఎన్ని తిప్పలు పడ్డాడో పాపం..!!

కేకేకు గన్ సెల్యూట్​తో నివాళి.. సీఎం మమత పుష్పాంజలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.