ఇందిరాగాంధీ, నెహ్రూ కుటుంబాలు దేశానికి చేసిన సేవలను తక్కువ చేసి చూపే ప్రయత్నం మోదీ ప్రభుత్వం చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా పార్లమెంట్లో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ... నెహ్రూను తక్కువ చేసి చూపారని ఆందోళన వ్యక్తం చేశారు.
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 76వ జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో కాంగ్రెస్ నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, జానారెడ్డి తదితరులు రాజీవ్‌గాంధీ చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛాలు పెట్టి శ్రద్ధాంజలి ఘటించారు.
దేశానికి, కాంగ్రెస్ పార్టీకి, రాజీవ్ గాంధీ ఎనలేని సేవ చేశారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కొనియాడారు. శాస్త్ర సాంకేతిక రంగాలను అభివృద్ధి చేయడం, పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు తీసుకురావడం లాంటి వాటితో భారత్ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపారని చెప్పారు.
ఇదీ చూడండి: కరోనా పరీక్షల సామర్థ్యం పెంపుపై ఐసీఎంఆర్ సూచనలు