లోక్‌సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఎన్నికలకు 72 గంటల ముందు నుంచి ప్రొటోకాల్ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. రేపు సాయంత్రం 5 గంటల తర్వాత ప్రచారం నిర్వహించకూడదని తెలిపారు. ఈనెల 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుందని, సమస్యాత్మక కేంద్రాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగుతుందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 34,604 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు రజత్‌కుమార్ వెల్లడించారు.
6,445 సమస్యాత్మక ఎన్నికల కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించినట్లు తెలిపారు.
ఇవీ చదవండి: హైదరాబాద్‌లో రూ.8 కోట్ల నగదు పట్టివేత