రేపు నిజామాబాద్‌లో పర్యటించనున్న ఈసీ బృందం నిజామాబాద్ ఎన్నికల బరిలో నిలిచిన రైతులకు గుర్తులు కేటాయించలేదనే వార్తలు అవాస్తవమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఇందూర్ ఎన్నికలపై నెలకొన్న అనుమానాలను తొలగించేందుకు తమ బృందం రేపు నిజామాబాద్‌లో పర్యటించనున్నట్లు తెలిపారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల పరిశీలన, రాజకీయ పార్టీల నేతలతో భేటీ, ఎన్నికల నిర్వాహణపై అధికారులతో సమీక్షలో పాల్గోనున్నారు. నిజామాబాద్ ఎన్నికలు దేశ చరిత్రలో నిలిచిపోతాయని తెలిపారు.
రూ.29 కోట్లు సీజ్
రాష్ట్రంలో ఇప్పటి వరకు నగదు, మద్యం, వస్తువులు కలిపి రూ.29 కోట్ల సొత్తు సీజ్ చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై 300కు పైగా కేసులు నమోదు చేశామన్నారు. చెల్లింపు వార్తలపై 600 ఫిర్యాదులు అందాయన్నారు. నిజామాబాద్‌లో ఎన్నికల నిర్వహణకు 1780 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈవీఎం సమస్యల పరిష్కారానికి 600 మంది ఇంజినీర్లు సిద్ధంగా ఉంటారన్నారు.