యాసంగి పంటకు సంబంధించి ఈనెల 28 నుంచి రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లో జమకానుంది. ఈనెల 27నుంచి సాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో రైతుబంధు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమీకరించింది. ఈ మేరకు 7వేల300 కోట్ల రూపాయలను విడుదల చేయాలని ఆర్థికశాఖకు స్పష్టం చేశారు.
బాండ్ల విక్రయం ద్వారా సర్కారు తాజాగా మరో రెండు వేల కోట్ల రూపాయలను రిజర్వ్ బ్యాంకు నుంచి రుణంగా తీసుకొంది. 27 ఆదివారం కావడం వల్ల నిధులను పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకొని... 28 నుంచి రైతుల ఖాతాల్లో నగదును నేరుగా జమచేయనున్నారు. పదిరోజుల్లోగా ప్రక్రియ మొత్తం పూర్తి కావాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు..
ఇదీ చూడండి: కానిస్టేబుల్ శివరాణికి గవర్నర్ అభినందన