parlament
దేశవ్యాప్తంగా ఈ పథకం ఎన్నో రాష్ట్రాలను ఆకర్షించింది. పథకం అమలు తీరు పరిశీలించాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణకు అధికారులను పంపిస్తున్నాయి. ఇప్పటికే ఒడిశా ప్రభుత్వం అన్నదాతలకు పెట్టుబడి సాయం చేయడానికి కసరత్తు మొదలు పెట్టింది. ఏపీ ప్రభుత్వం కూడా ఈ పథకంపై ఆసక్తి చూపుతోంది. కేంద్రం కూడా దీనికి ఫిదా అయింది.
ఇవాళ్టి బడ్జెట్లో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కూడా... రైతు బంధు తరహాలోనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి పదివేలు కేటాయించనుండగా.. కేంద్రం ఐదెకరాల్లోపు భూమి ఉన్నవారికి ఏడాదికి రూ. 6 వేల చొప్పున 3 విడతల్లో అందిస్తామని ప్రకటించింది.
తెరాసకు ఓట్లు రాలినట్టుగానే తమకు రైతుల అనుగ్రహం ఉంటుందనే భావనతో ఈ పథకం తీసుకొచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు కిసాన్ సమ్మాన్ యోజనకు మూలమైన రైతుబంధు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.