రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం సొమ్ము పంపిణీ ముగిసినట్లే. ఈ ఏడాది వానాకాలం సంబంధించి 60.84 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 7360.41 కోట్ల రూపాయల జమ అయ్యాయి. ఈ నెల 15 నుంచి 25 వరకు పది రోజుల్లో మొత్తం 147.21 లక్షల ఎకరాలకు రైతుబంధు పథకం నిధులు పంపిణీ ప్రక్రియ పూర్తైంది. ఎక్కడైనా రైతుబంధు సాయం రాకుండా మిగిలిపోయిన రైతులు తమ క్లస్టర్ పరిధిలో వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలి. తమ బ్యాంకు ఖాతాల వివరాలు ఏఈఓలకు సమర్పించాలి. ఖాతాలు సమర్పించిన రైతులకు వారి వారి ఖాతాల్లో నిధులు జమ చేయబడతాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.
రైతుబంధు నిధులను బ్యాంకర్లు పాతబాకీల కింద జమ చేసుకోవద్దని స్పష్టం చేశారు. ఒకవేళ జమ చేసుకున్న బ్యాంకులు తిరిగి రైతులకు అందజేయాలని సూచించారు. ఇది వరకే వ్యవసాయ శాఖ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితిని రైతుబంధు నిధులు బ్యాంకులు జమ చేసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరడం జరిగిందని చెప్పారు. ఇవాళ్టి వరకు రైతుబంధుకు అర్హులైన రైతుల బ్యాంకు ఖాతా వివరాల ప్రకారం అందరికీ నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: WATER DISPUTES: కేసీఆర్‌కు కేంద్రజలశక్తి మంత్రి ఫోన్.. 'రాయలసీమ'కు కృష్ణాబోర్డు బృందం