పిల్లలకు మొదటి గురువులు తల్లిదండ్రులని... వారి భవిష్యత్తుపై కుటుంబ సభ్యులు, పెరిగిన సమాజ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యురాలు మీనా చింతపల్లి అన్నారు. సికింద్రాబాద్లోని గాంధీ మెడికల్ అలుమ్ని ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆమె రాసిన రైసింగ్ హెల్త్చైల్డ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అపోలో గ్రూప్ హాస్పిటల్స్ అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్ హాజరయ్యారు. ఈ పుస్తకం భవిష్యత్ తరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన కొనియాడారు.