అరేబియా మధ్య ప్రాంతం నుంచి కర్ణాటక మీదుగా విదర్భ వరకూ 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఒడిశాపై ఉపరితల ఆవర్తనం ఉంది. వీటి ప్రభావం వల్ల శని, ఆదివారాల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో ఒక మాదిరి వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. వానలు లేని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 డిగ్రీల వరకూ అధికంగా ఉంటాయని ఆయన చెప్పారు.
శుక్రవారం పగలు అత్యధికంగా రామగుండంలో 37.4, హైదరాబాద్‌లో 35.2 డిగ్రీలుంది. అత్యల్పంగా రామగుండంలో 22, హైదరాబాద్‌లో 21.5 డిగ్రీలు నమోదయింది. గురువారం ఉదయం 8 నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 262 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. వంకేశ్వర్(నాగర్‌కర్నూల్ జిల్లా)లో 4.5, తుర్కపల్లి (భద్రాద్రి)లో 4.2, బొల్లారం(మేడ్చల్)లో 3.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు వీశాయి.
ఇవీచూడండి: తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రతిభ.. 9 వేలతో బ్యాటరీ సైకిల్