ETV Bharat / state

Weather Report: సకాలంలో రాష్ట్రంలోకి నైరుతి... ఈసారి మంచి వర్షాలే

రాష్ట్రంలో ఈసారి సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్‌ కె. నాగరత్న అంచనా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే మాదిరి  వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించారు. ఈసారి వేసవిలో మండుటెండలు లేకపోవడానికి మూల కారణం గాలులు దిశ మార్చుకోవడమేనని నాగరత్న స్పష్టం చేశారు.

rains in telangana, southwest monsoon to telangana
తెలంగాణకు నైరుతి పవనాలు
author img

By

Published : May 31, 2021, 7:08 AM IST

ప్రశ్న: వేసవి ముగింపు దశకు చేరింది. రాష్ట్రంలో ఈసారి పెద్దగా ఎండలు, వడగాడ్పులు లేకపోవడానికి కారణాలు..

జవాబు: వేసవిలో మార్చి నుంచే ఉత్తరాది, రాజస్థాన్‌, మధ్య భారత్‌ నుంచి వేడిగాలులు దక్షిణానికి వీస్తుంటాయి. ద్రోణులు ఏర్పడక వడగాడ్పులతో ఉష్ణోగ్రతలు మే నెలాఖరుకు మరింతగా పెరుగుతుంటాయి. ఈసారి తద్భిన్న పరిస్థితి.. దక్షిణాదితో పాటు బంగాళాఖాతం, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీచాయి. అవి వెంట తేమను తీసుకురావడంతో సాయంత్రం సమయాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిశాయి. వాటికి తోడు ఈదురుగాలులు ఉష్ణోగ్రతలను పెద్దగా పెరగకుండా చేశాయి. హైదరాబాద్‌లో రెండు మూడు రోజులే ఉష్ణోగ్రత 40 డిగ్రీలను తాకింది. రాష్ట్రంలో ఏప్రిల్‌ ఆఖరులో కొద్దిరోజులు వడగాడ్పులు వీచాయి. వచ్చే వారం రోజులు రాష్ట్రంలో 40 డిగ్రీల స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండవచ్చు.

ప్రశ్న: వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటే తర్వాత వర్షాలు బాగా పడతాయంటారు..ఈసారి అలా జరిగేనా?

జవాబు: అధిక ఉష్ణోగ్రతలతో వాతావరణంలో తేమతో మేఘాలు ఏర్పడి తర్వాత మంచి వానలు కురిసే అవకాశం ఉంటుందని అంచనా. ప్రస్తుత ఉష్ణోగ్రతలు సరిపోతాయి. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఒకేలా వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణలో మంచి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నాం.

ప్రశ్న: గతంలో ఎప్పుడైనా ఇలాంటి భిన్న పరిస్థితులు కన్పించాయా?

జవాబు: గతేడాదీ ఇంచుమించు ఇలాంటి వాతావరణమే ఉంది. వేసవి ఆఖరులో కొద్దిరోజులు మినహా ఎక్కువ రోజులు సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి.

ప్రశ్న: ఏటా ఫిబ్రవరి, మార్చిలో పడే వానలు.. ఈసారి లేవెందుకు?

జవాబు: ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవడానికి ద్రోణులు బలంగా ఉండాలి. ఉపరితల ఆవర్తనాలు ఏర్పడాలి. తెలంగాణ మీదుగా ఆవర్తనాలు ఏర్పడినా బలహీనంగా ఉన్నాయి. దీంతో ఉరుములు, మెరుపుల వానలు భద్రాది, వరంగల్‌, పశ్చిమ జిల్లాల వరకే పరిమితమయ్యాయి.

ఇదీ చదవండి: Lockdown 2.0: అంతర్రాష్ట్ర సర్వీసులు నడవవు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.